Taapsee - Anurag Kashyap: బాలీవుడ్లో పన్ను ఎగవేత వేసారని అనుమానము ఉన్న వారిపై ఆదాపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో లోని సొమ్మును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
Taapsee - Anurag Kashyap: బాలీవుడ్లో పన్ను ఎగవేత వేసారని అనుమానము ఉన్న వారిపై ఆదాపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ తాప్సీతో పాటు దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత మధవర్మ మంతెన సహా పలువురు ఇళ్లల్లో ఆదాయప పన్నుశాఖ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ముంబైతో పాటు పుణెలోని వీరి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఏక కాలంలో 30 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. పన్నులు ఎగువేస్తున్నారని సమాచారం అందడంతో.. ఐటీ అధికారులు రంగంలోకి దిగి మెరుపు దాడులు చేశారు. ఈ వ్యవహారం బాలీవుడ్‌తో అన్ని చిత్ర పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు బాలీవుడ్ సినీ నిర్మాత వికాస్ బల్, ఫాంటమ్ ఫిలిమ్స్, క్వాన్ టాలెంట్ అనే నిర్మాణ సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా ఆదాయపు పన్ను లెక్కల్లో తేలని సొమ్ము దాదాపు రూ. 300 కోట్లకు పైగా ఉన్నట్టు ఐటీ అధికారులు వెల్లడించారు.
ఆయా ప్రొడక్షన్ హౌసెస్ వెల్లడించిన బాక్సాఫీస్ లెక్కలకు వీళ్ల దగ్గర దొరికిన సొమ్ముకు ఎంతో తేడా ఉన్నట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. మొత్తంగా 30 పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో జరిపిన సోదాల్లో ఈ విషయం బయట పడింది. మరోవైపు నటి తాప్సీ దగ్గర దాదాపు రూ. 5 కోట్ల సొమ్ముకు సంబంధించిన ఎలాంటి లెక్క పత్రం లేదని చెప్పారు. అంతేకాదు ఆయా నిర్మాతలు, నటులకు సంబంధించిన.. లెక్కల్లో తేలని మరో రూ. 20 కోట్ల లెక్కకు పొంతన లేదని చెప్పారు. రెండు టాలెంట్ మెనేజ్మెంట్ కంపెనీల నుంచి లెక్కల్లో తేలని సొమ్ముతో పాటు డిజిటల్ డాటాను ఈ మెయిల్స్‌లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తారాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్‌తో పాటు మిగతా టాలెంట్ కంపెనీలకు సంబంధించిన 7 లాకర్స్‌ను ఆదాయపు అధికారులు గుర్తించి వాటి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాప్సీ, అనురాగ్ కశ్యప్
కొత్త వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్ మాట్లాడారు. ఇటీవల రిహానా పోస్ట్‌కు వ్యతిరేకంగా భారత సెలబ్రిటీలు మాట్లాడాన్ని కూడా వారు తప్పుబట్టారు. కాగా, తెలుగు మూవీ ఝుమ్మంది నాదం ద్వారా సినిమాల్లోకి వచ్చిన తాప్సీ.. ఆ తర్వాత తమిళ్‌తో పాటు హిందీ సినీ పరిశ్రమల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ప్రస్తుతం బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను ప్రస్తుతం శభాష్ మిథు చిత్రంలో నటిస్తోంది. టీమిండియా మహిళా క్రికెటర్ 'మిథాలి రాజ్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటోంది. ఇందులో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. అందుకోసం క్రికెటర్‌గా మారిపోయింది.శభాష్ మిథు చిత్రానికి రాహుల్ దోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు.