వాల్మీకి సినిమాకు బీజేపీ నేత వార్నింగ్.. ‘బోయ’వాడి వేటుకు..

Valmiki movie controversy: ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే వివాదం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందులోనూ పెద్ద సినిమాలకు కాంట్రవర్సీలు అనేది కామన్. ఏదో ఓ వివాదం లేకపోతే అదేదో అసంపూర్తిగా ఉంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 5:53 PM IST
వాల్మీకి సినిమాకు బీజేపీ నేత వార్నింగ్.. ‘బోయ’వాడి వేటుకు..
వాల్మీకి మూవీ పోస్టర్
  • Share this:
ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే వివాదం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందులోనూ పెద్ద సినిమాలకు కాంట్రవర్సీలు అనేది కామన్. ఏదో ఓ వివాదం లేకపోతే అదేదో అసంపూర్తిగా ఉంటుంది. ఇప్పుడు వాల్మీకి సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా బోయ సంఘం మాత్రం ఊరుకోవడం లేదు. వ‌రుణ్‌ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వస్తుంది వాల్మీకి. ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మంచివాడుగా ఎలా మారాడు..
T BJP Leader Laxman sensational comments on Valmiki movie and Boya community complaints him to title change pk ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే వివాదం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందులోనూ పెద్ద సినిమాలకు కాంట్రవర్సీలు అనేది కామన్. ఏదో ఓ వివాదం లేకపోతే అదేదో అసంపూర్తిగా ఉంటుంది. Valmiki movie controversy,Valmiki movie bjp leader laxman,Valmiki movie laxman,Valmiki movie boya community,Valmiki movie,Valmiki movie release date,varun tej Valmiki movie controversy,harish shankar Valmiki movie controversy,varun tej twitter,telangana High court notice Valmiki movie,high court Valmiki movie controversy,Valmiki controversy,pooja hegde varun tej,telugu cinema,వాల్మీకి,వాల్మీకి కాంట్రవర్సీ,వాల్మీకి వరుణ్ తేజ్,వాల్మీకి హరీష్ శంకర్,తెలుగు సినిమా
వాల్మీకిలో వరుణ్ Twitter.com/IAmVarunTej

ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది. బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం రాసాడు కాబట్టి.. తన సినిమా కూడా అలాగే ఉంటుందని తన సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టానని చెప్పాడు హరీష్ శంకర్. అయితే ఈ టైటిల్ విషయంలో ముందు నుంచి బోయ సామాజిక వ‌ర్గం నుంచి అభ్యంత‌రాలు వస్తూనే ఉన్నాయి. రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి పేరుని ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు ఎలా పెడ‌తారు.. అసలు ఆయన్ని ఓ గ్యాంగ్ స్టర్‌తో ఎలా పోలుస్తారంటూ వాళ్లు మండిపడుతున్నారు.
T BJP Leader Laxman sensational comments on Valmiki movie and Boya community complaints him to title change pk ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే వివాదం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందులోనూ పెద్ద సినిమాలకు కాంట్రవర్సీలు అనేది కామన్. ఏదో ఓ వివాదం లేకపోతే అదేదో అసంపూర్తిగా ఉంటుంది. Valmiki movie controversy,Valmiki movie bjp leader laxman,Valmiki movie laxman,Valmiki movie boya community,Valmiki movie,Valmiki movie release date,varun tej Valmiki movie controversy,harish shankar Valmiki movie controversy,varun tej twitter,telangana High court notice Valmiki movie,high court Valmiki movie controversy,Valmiki controversy,pooja hegde varun tej,telugu cinema,వాల్మీకి,వాల్మీకి కాంట్రవర్సీ,వాల్మీకి వరుణ్ తేజ్,వాల్మీకి హరీష్ శంకర్,తెలుగు సినిమా
వాల్మీకి కాంట్రవర్సీ

కచ్చితంగా ఈ టైటిల్‌ను మార్చాల్సిందే అంటూ వాళ్లు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఇష్యూలోకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మణ్‌ కూడా వచ్చారు. ఈయన్ని కొందరు బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతలు క‌లిశారు. ల‌క్ష్మ‌ణ్‌ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు `వాల్మీకి` టైటిల్ అని పెట్టడమే తప్పు.. దానివల్ల బోయ వాల్మీకి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
T BJP Leader Laxman sensational comments on Valmiki movie and Boya community complaints him to title change pk ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే వివాదం నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అందులోనూ పెద్ద సినిమాలకు కాంట్రవర్సీలు అనేది కామన్. ఏదో ఓ వివాదం లేకపోతే అదేదో అసంపూర్తిగా ఉంటుంది. Valmiki movie controversy,Valmiki movie bjp leader laxman,Valmiki movie laxman,Valmiki movie boya community,Valmiki movie,Valmiki movie release date,varun tej Valmiki movie controversy,harish shankar Valmiki movie controversy,varun tej twitter,telangana High court notice Valmiki movie,high court Valmiki movie controversy,Valmiki controversy,pooja hegde varun tej,telugu cinema,వాల్మీకి,వాల్మీకి కాంట్రవర్సీ,వాల్మీకి వరుణ్ తేజ్,వాల్మీకి హరీష్ శంకర్,తెలుగు సినిమా
వాల్మీకి కాంట్రవర్సీ

రామాయణం రాసిన వాల్మీకిని గ్యాంగ్‌స్ట‌ర్‌తో పోల్చడం పట్ల ఆ సామాజిక వర్గం వాళ్ళు తనను సంప్రదించారని చెప్పాడు లక్ష్మణ్. ఇప్పటికే ఈ ఇష్యూపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశామని.. త‌క్ష‌ణ‌మే సినిమా టైటిల్‌ను మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు లక్ష్మణ్. లేక‌పోతే బోయ‌లంతా ఏక‌మ‌వుతారని ఆయన హెచ్చరిస్తున్నాడు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టులే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందని చెప్పాడు ఈయన. మరి ఈ వివాదం నుంచి వాల్మీకి సినిమా ఎలా బయటపడుతుందో చూడాలి.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading