హోమ్ /వార్తలు /సినిమా /

నయనతార పెళ్లికి రెడీ.. వేదిక కూడా ఫిక్స్ చేసిన సైరా భామ..

నయనతార పెళ్లికి రెడీ.. వేదిక కూడా ఫిక్స్ చేసిన సైరా భామ..

Twitter/NayantharaU

Twitter/NayantharaU

Nayanthara : నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ బంధం ఇప్పుడు పెళ్ళిగా మారనుంది.

Nayanthara : నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ బంధం ఇప్పుడు పెళ్ళిగా మారనుంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతోందిని టాక్. తాజా సమాచారం మేరకు వీరిద్దరి పెళ్లి ఈ  సంవత్సరం చివర్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి పెళ్లి ఇక్కడ కాకుండా.. ఈ జంట విదేశాల్లో ఘనంగా పెళ్లి చేసుకొనున్నట్టు సమాచారం.  పెళ్లికి సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబందించి ఎలాంటీ అధికార ప్రకటన రాలేదు. కానీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు బ్యాగ్ గ్రౌండ్‌లో జరుగుతున్నాయని తమిళ చిత్ర వర్గాల సమాచారం.

నయనతార,  విఘ్నేష్ శివన్ ‘నేనూ రౌడీనే..’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. ఇకా అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి ఫిల్మ్ ఫంక్షన్స్‌కు అటెండ్ కావడం, వివిధ విహార యాత్రలకు వెళ్లడం.. అంతేకాదు వాటికి సంబందించిన ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పంచుకోవడం తెలిసిందే. నయనతార తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. సైరా  అక్టోబర్‌2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నయన్ మరోవైపు విజయ్‌తో కలిసి ‘బిగిల్‌’ చిత్రంలో నటించారు. అంతేకాకుండా రజనీ ‘దర్బార్‌’లో కూడా నయనతార కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు ప్రియుడు నిర్మిస్తున్న 'నెట్రికన్'  అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటివలే మొదలైంది.

First published:

Tags: Nayanthara, Telugu Movie News

ఉత్తమ కథలు