సైరా టీజర్‌లో అదే హైలైట్!

ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు మెగా అభిమానులు కూడా దీనికోసమే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ సినిమా వస్తుందా.. ఎప్పుడెప్పుడు అన్నయ్యను తెరపై చూద్దామా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. దీన్ని మరింత పెంచుతూ ఒక్కో రోజు ఒక్కో స్టిల్ విడుదల చేస్తున్నారు.

news18-telugu
Updated: August 20, 2018, 4:25 PM IST
సైరా టీజర్‌లో అదే హైలైట్!
సైరా నరసింహారెడ్డి మూవీ పోస్టర్
  • Share this:
ఐదు రోజుల నుంచి రోజకో స్టిల్ విడుదల చేస్తూ ‘సైరా’ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కౌంట్ డౌన్ పోస్టర్స్ టీజర్‌పై ఆసక్తిని రెండింతలు కాదు.. పదింతలు చేస్తున్నాయి. పైగా ఈ ఒక్క టీజర్ కోసమే 15 రోజులకు పైగా ప్రత్యేకంగా ఓ టీం పని చేస్తున్నారు. 33 సెకన్ల పాటు ఈ టీజర్ ఉంటుందని తెలుస్తుంది. అందులో చిరంజీవి ఒక్కడే కనిపించబోతున్నాడు. వార్ సీన్స్ మరింతగా హైలైట్ కానున్నాయి. వీటి కోసమే సినిమాలో చాలా వరకు ఖర్చు చేసాడు నిర్మాత రామ్ చరణ్.మొన్న హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్ కోసమే ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాడు. ‘సాహో’ తర్వాత ఒక్క షెడ్యూల్ కోసం అంతగా ఖర్చు చేసిన సినిమా ఇదే. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు కావడంతో ఓ రోజు ముందే ప్రేక్షకులతో పాటు అభిమానులకు ట్రీట్ ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. అందుకే ఆగస్ట్ 21 ఉదయం 11.30 నిమిషాలకే టీజర్ విడుదల చేస్తున్నారు.


ఈ టీజర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందర్లోనూ ఉంది. దానికి ముందు నుంచే హింట్స్ ఇస్తూ వస్తున్నారు టీం కూడా. మూడు రోజులుగా రోజుకో స్టిల్ విడుదల చేస్తున్నారు. వీటిని ఒక్కసారి చూస్తే అర్థం అయిపోతుంది టీజర్ ఎలా ఉండబోతుందో..? ఓ రోజు కత్తి.. మరోరోజు చిరంజీవి వెనక నుంచి నిలబడిన రూపం.. ఇంకోరోజు కేవలం సింహగర్జన.. ఇలా ప్రతీరోజు విడుదలవుతున్న స్టిల్ ఫ్యాన్స్ కు అయితే నిద్ర కూడా పట్టించడం లేదు. అంతగా పిచ్చోళ్లను చేస్తుంది. పైగా చిరు మేనియా అంటే మామూలుగా ఉండదు.పదేళ్ల తర్వాత వచ్చినా కూడా 100 కోట్లు వసూలు చేసిన సత్తా చిరు సొంతం. చాలా తెలివిగా ఖైదీ నెం.150ని తన మార్కెట్ కోసం వాడుకుని.. ఇప్పుడు పూర్తిస్థాయిగా రంగంలోకి దిగుతున్నాడు చిరంజీవి. ఖైదీ ఇచ్చిన ఉత్సాహం.. నమ్మకంతోనే 200 కోట్లతో సైరా వస్తుందిప్పుడు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది షూటింగ్. ప్రత్యేకంగా వేసిన సెట్ లో నైట్ షూట్స్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ప్రస్తుతానికి వర్షం కారణంగా చిత్రీకరణకు చిన్న అంతరాయం వస్తున్నా కూడా మెగాస్టార్ మాత్రం దూసుకుపోతున్నాడు. ఏదేమైనా ఇంకొన్ని గంటలు ఆగితే చాలు.. సైరా ప్రభంజనం ఎలా ఉంటుందో చూడొచ్చు. అది వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కూడా అరాచకాలు తప్పవు. అందుకే తుఫాన్ రాకముందు ప్రశాంతతలా కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలేవీ రాలేదు. ఇక ఇప్పుడు చిరు వచ్చి రచ్చ చేయడం ఒక్కటే తరువాయి.
Published by: Santhosh Kumar S
First published: August 20, 2018, 4:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading