Sye raa: భీమవరం చిరంజీవి అభిమానులపై... ఉపాసన స్పెషల్ ట్వీట్

ఉపాసన (instagram/Photo)

Sye raa: ఈ బ్యానర్‌ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేస్తూ... భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

  • Share this:
    ప్రత్యేకంగా భీమవరం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌పై ట్వీట్ చేశారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన ... తన మామయ్య ‘సైరా’ సినిమా విడుదల సందర్బంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ‘సైరా’ సినిమా విడుదలను చిరు అభిమానులు ఓ పండగలా చేసుకుంటున్నారు. భీమవరంలో సైరా సినిమా కోసం పెద్ద పోస్టర్ ఏర్పాటు చేశారు. 250 అడుగుల పొడవైన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దాదాపు అరకిలోమీటలర్ వరకు చిరంజీవి అభిమానులు సైరా కోసం అభిమానులు బ్యానర్ కట్టారు. అయితే ఈ బ్యానర్‌ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేస్తూ... భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన కొణిదెల.

    గతంలో బాహుబలి సినిమా విషయంలో దాదాపు అర కిలోమీటర్ వరకు సాహో బ్యానర కట్టి ఔరా అనిపించారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు అదే భీమవరంలో చిరంజీవి అభిమానులు కూడా అచ్చం ఇలాంటి పోస్టర్ ఒకటి పెట్టారు. సైరాకు కూడా అదే స్థాయిలో బ్యానర్ కట్టి మెగా పవర్ ఏంటో చూపించారు. ప్రభాస్ సొంతూళ్లేనే ఈ బ్యానర్ కట్టి అక్కడ మెగా ఫ్యాన్స్‌కు కూడా తిరుగులేదని సవాల్ చేసారు. ఒకప్పుడు పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య కూడా భీమవరంలో గొడవలు కూడా చోటు చేసుకున్నాయి.

    First published: