Sye Raa Trailer 2: సైరా రెండో ట్రైలర్ విడుదల.. గడ్డి పొరక కూడా గడ్డ దాటొద్దు..

Sye Raa Trailer 2: మెగా అభిమానులకు సైరా నిర్మాత రామ్‌చరణ్ మరో అద్భుత కానుక అందించాడు. తాజాగా రెండో ట్రైలర్‌ను ‘సైరా నరసింహారెడ్డి-ది బ్యాటిల్ ఫీల్డ్’ పేరుతో విడుదల చేశారు. సినిమాలోని పలు యుద్ధ సన్నివేశాలను ఇందులో చూపించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 26, 2019, 11:49 AM IST
Sye Raa Trailer 2: సైరా రెండో ట్రైలర్ విడుదల.. గడ్డి పొరక కూడా గడ్డ దాటొద్దు..
సైరా పోస్టర్
  • Share this:
మెగా అభిమానులకు సైరా నిర్మాత రామ్‌చరణ్ మరో అద్భుత కానుక అందించాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి తొలి ట్రైలర్ విడుదల చేయగా 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోన్న విషయం తెలిసిందే. ట్రైలర్‌లోనే చిరంజీవి అద్భుత నటనతో తన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు తాజాగా రెండో ట్రైలర్‌ను ‘సైరా నరసింహారెడ్డి-ది బ్యాటిల్ ఫీల్డ్’ పేరుతో చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాలోని పలు యుద్ధ సన్నివేశాలను ఇందులో చూపించారు. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు... చంపడం చావడం ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం అన్న డైలాగులు కిరాక్ పుట్టించాయి. స్వాతంత్య్రం ఒక్కటే మన లక్ష్యం అన్న డైలాగ్ కూడా కేక పుట్టించింది.


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాను చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్‌ అద్భుతమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్న విషయం తెలిసిందే.
First published: September 26, 2019, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading