సైరా అభిమానులకు మరో అద్భుత కానుక.. ఈ రోజు మరో ట్రైలర్ విడుదల..

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సైరా సినిమాను విడుదల చేస్తుండగా.. ఆ లోపు మెగా అభిమానులకు రామ్‌చరణ్ మరో అద్భుత కానుక అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు మరో ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 26, 2019, 7:14 AM IST
సైరా అభిమానులకు మరో అద్భుత కానుక.. ఈ రోజు మరో ట్రైలర్ విడుదల..
నేడు సైరా రెండో ట్రైలర్ విడుదల
  • Share this:
బాహుబలి సినిమాల తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న సినిమా సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాను చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన విషయం తెలిసిందే. సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయగా.. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ట్రైలర్ చూసి విమర్శకులు సైతం మెగాస్టార్‌కు ఫిదా అవుతున్నారు. అటు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు అంతా చిరంజీవి నటన చూసి పడిపోతున్నారు. సైరా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోన్న విషయం తెలిసిందే.

కాగా, ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్‌ అద్భుతమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సినిమాను విడుదల చేస్తుండగా.. ఆ లోపు మెగా అభిమానులకు రామ్‌చరణ్ మరో అద్భుత కానుక అందిస్తున్నాడు.

సైరా ట్రైలర్ 2 పోస్టర్


ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గురువారం ఉదయం 10:30 గంటలకు ట్రైలర్‌2ను విడుదల చేస్తున్నామని, సినిమాలోని యుద్ధ సన్నివేశాలను (బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్) చూపించబోతున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.


First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>