‘సైరా’ కి మరో ఎదురుదెబ్బ.. చిరంజీవి ఆఫీస్ ఎదుట ఉయ్యాలవాడ వారసుల ధర్నా..

చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు దగ్గర పడే సమయంలో ఉయ్యాలవాడ వారసులు చిరంజీవి ఆఫీస్ ముందు ధర్నా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: September 14, 2019, 3:45 PM IST
‘సైరా’ కి మరో ఎదురుదెబ్బ.. చిరంజీవి ఆఫీస్ ఎదుట ఉయ్యాలవాడ వారసుల ధర్నా..
‘సైరా నరసింహారెడ్డి’ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ
news18-telugu
Updated: September 14, 2019, 3:45 PM IST
చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు.  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్.బి.స్టేడియంలో జరగనుంది. అంతేకాదు అక్టోబర్ 2న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇటువంటి సమయంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు అనుకోని చిక్కోచ్చి పడింది. తాజాగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఆఫీసు ముందు ధర్నాకు దిగారు.

Sye raa..narasimha Reddy: Uyyalawada Narasimha Reddy family members protest in front of Ram Charan office,Uyyalawada Narasimha Reddy,Sye raa narasimha Reddy,Chiranjeevi,Megastar chiranjeevi,Uyyalawada Narasimha Reddy family members protest,ram charan,Chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi facebook,ram charan facebook,ram charan instagram,ram charan twitter,Chiranjeevi,megastar chiranjeevi,chiru,koratala siva,chiranjeevi koratala siva,nayanthara,nayanthara chiranjeevi koratala siva,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,చిరంజీవి,కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ,నయనతార,నయనతార చిరంజీవి కొరటాల శివ,నయనతార చిరంజీవి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీసే సమయంలో ఈ సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం అడిగితే ఇచ్చామన్నారు. అంతేకాదు షూటింగ్‌కు అనువైన లొకేషన్స్‌తో పాటు ..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి సంబంధించిన సమస్త సమాచారం మా నుంచి తీసుకున్నారు. ఆ సమయంలో తమకు న్యాయం చేస్తామని చిరంజీవి హామి ఇచ్చారు. మరోవైపు సినిమాను తెరకెక్కించినందుకు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ పారితోషకం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఉయ్యాలవాడ వారసులు.. చిరంజీవి, రామ్ చరణ్‌ను కలవడానికి ప్రయత్నించినా.. ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ కలవనివ్వడం లేదని ఆరోపించారు. ఇక చిరంజీవి ఆఫీసు ముందు  ఆందోళన జరుగుతుందని తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తీరా ఇపుడు మమల్ని కలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని చిరంజీవి పై ఆరోపణలు గుప్పించారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...