news18-telugu
Updated: October 2, 2019, 7:15 PM IST
సైరా పోస్టర్
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సైరా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు.. టికెట్ల కోసం అభిమానుల క్యూలు.. చూసి మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సైరా టీమ్‌కి అంతలోనే బిగ్ షాక్ తగిలింది. సైరా నరసింహ్మారెడ్డి పంజా విసిరిన తమిళ్ రాకర్స్.. మూవీని పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టారు. విడుదలైన రోజే మాట్నీ షో కంటే ముందే పైరసీ చేశారు. దీనిపై చిత్ర దర్శక నిర్మాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చక్కర్లు కొడుతున్న పైరసీ లింకులతో మెగా అభిమానులు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

సైరా
సైరా చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తోంది మూవీ యూనిట్. థియేటర్లలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయకూడని కోరింది. ఇక పైరసీ లింకులు కనిపిస్తే syeraaantipiracy@gmail.comకి పంపించాలని సూచించింది. ఇక ఇప్పటికే సైరా చిత్రం పైరసీకి గురికావడంతో అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందుతాయి. చిత్ర యూనిట్‌కు పైరసీ లింకులను షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మీకు కూడా ఎక్కడైనా పైరసీ లింకులు కనిపిస్తే పైన పేర్కొన్న మెయిల్ ఐడీకి పంపించండి.
మూవీలు పైరసీ బారినపడకుండా టెక్నికల్ టీమ్స్ ఎంతో వర్క్ చేస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. దర్శక నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడి సినిమాను తీస్తే.. రిలీజైన రోజే అప్పనంగా కాజేస్తున్నారు సైబర్ దొంగలు. ఎక్కడో ఓ చోట చిత్రాన్ని రికార్డ్‌చేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు కేటుగాళ్లు. అంతటా సర్కులేట్ చేస్తూ నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చట్టం, టెక్నాలజీలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని చెలరేగిపోతున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 2, 2019, 7:15 PM IST