సైరా కోసం తెగ ఫీల్ అయిపోతున్న నాని

సినిమాలో చిరంజీవి నటన చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయంటూ సైరాను ఆకాశానికెత్తుతున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం సైరా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

సినిమాలో చిరంజీవి నటన చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయంటూ సైరాను ఆకాశానికెత్తుతున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం సైరా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

  • Share this:
    మెగా అభిమానులకు దసరా పండగ ముందే వచ్చింది. సైరా మూవీకి హిట్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద మెగా పండగ జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో చిరంజీవి నటన చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయంటూ సైరాను ఆకాశానికెత్తుతున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం సైరా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలే మూవీని తీశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ మూవీపై నాచురల్ స్టార్ నాని స్పందించారు. సినిమాను చూడలేపోయానంటూ తెగ ఫీల్ అయిపోయారు.

    టాలీవుడ్ ఇండస్ట్రీ సైరా చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటే నాని మాత్రం చూడలేదట. ప్రస్తుతం తాను దక్షిణ కొరియాలో ఉన్నానని.. ఇక్కడ సినిమా చూసే అవకాశం లేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సినిమాను చూడలేకపోయినా.. సైరా సక్సెస్ టాక్ మాత్రం వినపడిందని పేర్కొన్నారు నాని. బాక్సాఫీస్ ఘరనా మొగుడు మళ్లీ వచ్చాడంటూ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపించారు నాచురల్ స్టార్. సినిమా కోసం ఇక వెయిట్ చేయడం తన వల్ల కాదని చెప్పారు. ఇక్కడి నుంచే చిరంజీవికి పెద్ద హగ్ అంటూ ఎఫ్‌బీలో పోస్ట్ పెట్టారు నాని.
    First published: