అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి...

Sye Raa on Amazon Prime : మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

news18-telugu
Updated: November 20, 2019, 7:57 AM IST
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి...
Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్  ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.  అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బిజినెస్‌ను దాదాపు పూర్తి చేసుకుంది. ఈరోజుతో ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలై  50 రోజులు అవుతోంది. దీంతో అనుకున్న ఒప్పుందం ప్రకారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సైరా నవంబర్ 21న అంటే రేపు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. సైరా ఒక్క హిందీలో తప్ప..  సౌత్ ఇండియా భాషాలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ  భాషాల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
GQ మ్యాగజైన్‌ కోసం దీపికా అందాల ఆరబోత..
First published: November 20, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading