మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి..

చిరంజీవి సైరా షూటింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది.. ఈ చిత్రం ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది.. అస‌లు చిరంజీవి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడా లేదా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 24, 2019, 7:46 PM IST
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి..
ఇప్పుడు మరోసారి సురేందర్ రెడ్డి మరోసారి రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక కొరటాల శివ కూడా మెగా కంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
  • Share this:
చిరంజీవి సైరా షూటింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది.. ఈ చిత్రం ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది.. అస‌లు చిరంజీవి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడా లేదా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో వ‌స్తున్న త‌రుణంలో సైరా షూటింగ్ అయిపోయింద‌ని తీపిక‌బురు చెప్పారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ర‌త్న‌వేలు ఈ విష‌యాన్ని ట్వీట్ చేసాడు. సైరా సినిమా షూటింగ్ కోసం రెండేళ్ల‌కు పైగానే క‌ష్ట‌ప‌డ్డామ‌ని చెప్పాడు ర‌త్న‌వేలు.
Sye Raa Narasimha Reddy movie Shooting completed.. DOP Ratnavelu tweet on Megastar movie pk.. చిరంజీవి సైరా షూటింగ్ ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది.. ఈ చిత్రం ఇంకా ఎన్ని రోజులు సెట్స్ పైనే ఉంటుంది.. అస‌లు చిరంజీవి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడా లేదా.. ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల్లో.. sye raa twitter,sye raa shooting,sye raa shooting completed,ratnavelu twitter,chiranjeevi surender reddy,surender reddy ram charan,chiranjeevi nayanthara,chiranjeevi tamannaah,sye raa narasimha reddy,sye raa narasimha reddy teaser,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy first look,sye raa narasimha reddy songs,sye raa narasimha reddy movie updates,chiranjeevi sye raa narasimha reddy movie,sye raa,sye raa narasimha reddy motion poster,sye raa teaser,sye raa trailer,surender reddy,chiranjeevi's sye raa narasimha reddy,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా షూటింగ్ పూర్తి,రత్నవేలు ట్విట్టర్,సురేందర్ రెడ్డి రత్నవేలు,సురేందర్ రెడ్డి చిరంజీవి,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
సురేందర్ రెడ్డితో సినిమాటోగ్రఫర్ రత్నవేలు


చిరంజీవి ఇందులో భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ పాత్ర కోసం వ‌య‌సును కూడా లెక్క చేయ‌కుండా యాక్ష‌న్ స్టంట్స్ చేస్తున్నాడు మెగాస్టార్. త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, జ‌గ‌ప‌తిబాబు లాంటి స్టార్ క్యాస్ట్ కూడా ఉన్నారు. ఇక విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. హాలీవుడ్ టెక్నిక‌ల్ టీం ఈ సినిమా కోసం ప‌ని చేస్తున్నారు.



ఇన్నేళ్ల మా క‌ష్టం ఇప్పుడు పూర్త‌యింది.. క‌చ్చితంగా క‌ష్టానికి త‌గిన ఫ‌లితం కూడా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం అంటున్నాడు ఈయ‌న‌. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌తో బిజీ కానుంది చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే చిరంజీవి డ‌బ్బింగ్ మొద‌లు పెట్టాడు. ఇంట్లో కూడా ఇదే చేస్తున్నాడు ఈయ‌న‌. చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆగష్టు 22న సైరా ట్రైలర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక అక్టోబర్ 2న తేదీన సినిమా విడుద‌ల చేయ‌నున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: June 24, 2019, 7:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading