రివ్యూ: సైరా నరసింహా రెడ్డి.. తెల్లదొరలపై తెలుగువాడి పౌరుషం..

కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. మరి ఈ చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడు..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 2, 2019, 1:33 PM IST
రివ్యూ: సైరా నరసింహా రెడ్డి.. తెల్లదొరలపై తెలుగువాడి పౌరుషం..
సైరా పోస్టర్ Twitter
  • Share this:
నటీనటులు: చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది

సినిమాటోగ్రఫీ: రత్నవేలు
కథ: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామ్ చరణ్

కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. మరి ఈ చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడు..?కథ:
బ్రిటీష్ వాళ్లు ఇండియాను ఆక్రమించుకుని పరిపాలిస్తున్న రోజుల్లోనే రేనాటి గడ్డపై ఉండే పాలెగాడు మజ్జారి నరసింహా రెడ్డి (చిరంజీవి) తెల్లవాళ్లకు ఎదురు తిరుగుతుంటాడు. శిస్తు కట్టుకుండా బ్రిటీష్ దొరలకు ఎదిరించడమే కాకుండా ప్రజల్లో కూడా పోరాట భావం నేర్పిస్తుంటాడు. దాంతో బ్రిటీష్ వాళ్లు ఉయ్యాలవాడపై కక్ష్య కడతారు. ఇక ఆ సమయంలోనే నరసింహా రెడ్డితో వీరా రెడ్డి, బసి రెడ్డి, పాపా ఖాన్ లాంటి సామంత రాజులు కూడా తోడవుతారు. అంతా కలిసి ఉద్యమిస్తారు. అలాంటి ఉయ్యాలవాడ జీవితంలోకి లక్ష్మి (తమన్నా) వస్తుంది. కానీ దానికి ముందే ఈయన జీవితంలో సిద్ధమ్మ (నయనతార) కూడా ఉంటుంది. ఇక ప్రతీ విషయాన్ని.. బ్రిటీష్ వాళ్లపై ప్రతీ పోరాటాన్ని గురు గోసై వెంకన్న (అమితాబ్ బచ్చన్) ఆధ్వర్యంలో చేస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ అందరి సహకారంతో తెల్లోళ్లపై దండయాత్ర ఎలా చేసాడు అనేది అసలు కథ..

కథనం:
చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశభక్తి గురించి చెప్పడానికి ఈ ముక్క చాలు.. చరిత్ర మరచిన వీరుడి గురించి చిరంజీవి మళ్లీ గుర్తు చేశాడు. సినిమాగా చూసుకుంటే సైరా నరసింహారెడ్డిలో లోపాలు కనిపిస్తాయేమో కానీ.. ఒక చరిత్రను తెరకెక్కించిన విధానం చూస్తే మాత్రం ఏ లోపం లేదు.. చరిత్రను చెడగొట్టకుండా.. కమర్షియల్ అంశాలు జోడించి.. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తన వంతు బాగానే తెరకెక్కించాడు. ఝాన్సీ లక్ష్మీభాయ్ తన సైనికుల్లో స్పూర్తి రగిల్చడానికి ఉయ్యాలవాడ కథను చెప్పడం అనే కోణం నుంచి కథ మొదలు పెట్టడం దర్శకత్వ ప్రతిభకు తార్కాణం. దాంతో పాటు పవన్ వాయిస్ ఓవర్ కూడా బాగుంది. ఇక వయసు మర్చిపోయి చిరంజీవి కూడా ఉయ్యాలవాడ పాత్రకు ప్రాణం పోసాడు. రేనాటి సూర్యుడుగా.. స్వతంత్ర్య భారతానికి అసువులు బాసిన తొలి సమిధగా.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి కథను తీసుకొని.. పక్కదారి పట్టకుండా.. తనకు ఉన్న పరిధిలోనే చిరంజీవి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ సినిమా తీసాడు సురేందర్ రెడ్డి.. 18వ శతాబ్దపు నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చూపించింది ఆర్ట్ డైరెక్షన్ టీం.. నాడు భారతదేశంలో బ్రిటిష్ వారి అక్రమాలను చూపిస్తూ.. వాళ్లపై ఉయ్యాలవాడ చేసిన పరాక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు సురేందర్ రెడ్డి.. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయం కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు.. దాంతో తొలి అర్ధ భాగం కాస్త సాగినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి తెల్లదొరలపై ఉయ్యాలవాడ తిరుగుబాటు మొదలైన తర్వాత.. క్లైమాక్స్ వరకు ఎక్కడా ఆగకుండా పరుగులు పెట్టింది కథ. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది.. ఈ సీన్ డిజైన్ చేశాడు దర్శకుడు. ఉరికొయ్యకు వేలాడుతూ కూడా ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించిన ఆయన మరణం అమరం. ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటించలేదు.. జీవించాడు. నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా నటించాడు. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువగానే ఉన్నా కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక నయన్, చిరు మధ్య సీన్స్ కూడా అంతే. తమన్నా చిన్న పాత్రలో నటించినా కూడా తనదైన ముద్ర వేసింది. సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు చిన్నచిన్న పాత్రలు చేసిన ఎవరికి వారు మెప్పించారు... నయనతార, తమన్నా కథలో భాగంగా మారిపోయారు. ఓవరాల్ గా సైరా నరసింహారెడ్డి.. ఓ దేశభక్తుడి వీరమరణం.

నటీనటులు:
చిరంజీవి అద్భుతంగా నటించాడు అంటే సరిపోదు.. జీవించాడు అని చెప్పాలి. ఈ పాత్ర కోసం వయసును కూడా పూర్తిగా పక్కనబెట్టేసాడు చిరు. తన పదేళ్ల కల కోసం ప్రాణం పెట్టి పని చేసాడు. యుద్ధ సన్నివేశాలు కూడా అదరగొట్టాడు. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా బాగుంది. కొన్ని సన్నివేశాలే అయినా కూడా కథను ముందుకు నడిపించాడు. జగపతిబాబు, సుదీప్, రవికిషన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ కూడా అద్భుతంగా నటించారు. ఎవరికి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేసారు. తమన్నా, నయనతార చిన్న పాత్రల్లో కథకు సాయపడ్డారు. అనుష్క అతిథి పాత్రలో బాగుంది.. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఊహించినంతగా ఆకట్టుకోలేదు.

టెక్నికల్ టీం:
అమిత్ త్రివేది సంగీతం సినిమాకు ప్రాణం. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పాటలు రెండే ఉన్నా కథను నడిపించే విధంగా ఆర్ఆర్ ఉంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్ లో కారెక్టర్ ఇంట్రోస్ కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. అక్కడ ల్యాగ్ అయినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ అద్భుతం. రత్నవేలు పనితీరు అమోఘం. దర్శకుడిగా సురేందర్ రెడ్డి తనకున్న పరిధిలో అద్భుతంగా సైరాను తెరకెక్కించాడు. అయితే స్క్రీన్ ప్లే మ్యాజిక్ అక్కడక్కడా మిస్ కావడం ఒక్కటే మైనస్. తెలిసిపోయే కథ ఆసక్తి తగ్గిస్తుంది. కానీ తెరకెక్కించిన విధానం మాత్రం బాగుంది. రామ్ చరణ్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

చివరగా ఒక్కమాట:
సైరా నరసింహా రెడ్డి.. తెల్లదొరలపై తెలుగువాడి పౌరుషం..

రేటింగ్: 3.25/5
First published: October 2, 2019, 1:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading