తెలుగు సినిమాకు రికార్డులు నేర్పిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుంటాడు. ఆయన సృష్టించిన రికార్డులను ఇప్పటికీ ఏ హీరో అందుకోలేకపోతున్నాడు. మెగాస్టార్ అంటేనే కేరాఫ్ రికార్డ్స్. అలాంటి చిరంజీవి పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. వచ్చిన వెంటనే ఖైదీ నెం 150 సినిమాతో మళ్లీ 100 కోట్ల మార్క్ అందుకుని ఔరా అనిపించాడు. ఇక ఇప్పుడు సైరాతో మరోసారి తన సత్తా చూపిస్తున్నాడు అన్నయ్య. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డులు తిరగరాస్తుంది. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో తెలుగు సినిమాలు ఇప్పటి వరకు అందుకోలేని రికార్డులను చేరుకుంటుంది సైరా.
అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. ముఖ్యంగా చిరంజీవికి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తూగో జిల్లాలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది సైరా. మొన్నటి వరకు బాహుబలి 18 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది.. ఆ తర్వాత సాహో థియేట్రికల్ హక్కులను 19.5 కోట్లకు కొన్నారు.
ఇప్పుడు 19.6 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇదే కానీ నిజమైతే చిరంజీవి మరోసారి రికార్దులకు తెరతీసినట్లే. ఓ తెలుగు సినిమా ఒకే ఏరియాలో ఈ స్థాయిలో బిజినెస్ చేయడం కూడా అద్భుతమే. సైరా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో విడుదల కానుంది సైరా నరసింహా రెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Prabhas, Sye Raa Narasimha Reddy Movie Review, Telugu Cinema, Tollywood