SYE RAA NARASIMHA REDDY MOVIE CREATED RECORDS IN TELANGANA AND CHIRANJEEVI PROVED HIS STAMINA ONCE AGAIN PK
నైజాంలో ‘సైరా’ దూకుడు.. ఎనీ టైమ్ చిరంజీవి ఒక్కడే మొనగాడు..
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో మార్కెట్ ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలంగాణలో సంచలనాలు సృష్టించడం అనేది కామన్. ఒకప్పుడు ఈయన..
మెగాస్టార్ చిరంజీవికి నైజాంలో మార్కెట్ ఎంత ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలంగాణలో సంచలనాలు సృష్టించడం అనేది కామన్. ఒకప్పుడు ఈయన తిరగరాయని రికార్డులు లేవు.. ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ రికార్డులు కోకొల్లలు. నైజాంలో మెగాస్టార్ సినిమా వచ్చిందంటే చాలు కొత్త రికార్దులకు తెర తీయాల్సిందే. ఇప్పుడు విడుదలైన సైరా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై.. నైజాంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇక్కడ 30 కోట్లకు అమ్మారు.
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
అంత భారీ మొత్తానికి అమ్మినపుడు నిజంగానే అంత వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ కనిపించాయి. ఇఫ్పుడు అందరి అంచనాలు నిలబెడుతూ ఈ సినిమా 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నైజాంలో బాహుబలి తర్వాత అంత స్థాయిలో వసూలు చేసిన సినిమా ఇదే. విడుదలైన 14వ రోజు కూడా 40 లక్షల షేర్ వసూలు చేసింది సైరా. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకెళ్తుంది ఈ చిత్రం. పైగా తెలంగాణలో సెలవులు మరో వారం పొడగించడంతో దాన్ని కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. మొత్తానికి అంచనాలు అందుకుంటూ నైజాం కింగ్ అనిపించుకున్నాడు చిరంజీవి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.