‘సైరా’ సెన్సార్ రివ్యూ.. రేనాటి సూర్యుడి వెన్నుచూపని వీరగాథ..

సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల కానుండటంతో అక్కడా సైరాపై భారీ అంచనాలున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 7:27 PM IST
‘సైరా’ సెన్సార్ రివ్యూ.. రేనాటి సూర్యుడి వెన్నుచూపని వీరగాథ..
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ (Twitter/Photo)
  • Share this:
సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల కానుండటంతో అక్కడా సైరాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తైంది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా విడుదల చేసింది బోర్డ్. 2 గంటల 50 నిమిషాల నిడివితో విడుదల కానుంది సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్టోబర్ 2న విడుదల కానుంది సైరా. చిరంజీవి ఈ చిత్రంతో కచ్చితంగా సంచలనం సృష్టిస్తాడని.. మరోసారి చరిత్ర తిరగరాయడం ఖాయం అంటున్నారు సెన్సార్ సభ్యులు.
Sye Raa Narasimha Reddy movie censor review and Chiranjeevi will live up the expectations pk సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల కానుండటంతో అక్కడా సైరాపై భారీ అంచనాలున్నాయి. sye raa,sye raa movie,sye raa movie twitter,sye raa movie censor,sye raa censor review,sye raa movie censor review,sye raa preveiw,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రివ్యూ,సైరా సెన్సార్ రివ్యూ,చిరంజీవి సైరా రివ్యూ,తెలుగు సినిమా
సైరా నరసింహారెడ్డి (Source: Twitter)

ముఖ్యంగా సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని.. 180 ఏళ్ల నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా చూపించడం మామూలు విషయం కాదంటున్నారు వాళ్లు. తెలుగు సినిమా స్థాయి సైరాతో మరింత పెరగడం పక్కా అనే ప్రచారం జరుగుతుంది. సెన్సార్ సభ్యుల నుంచి పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది సైరా. మరీ ముఖ్యంగా సినిమా మొదలైన విధానం కూడా ఆకట్టుకుంటుందని.. చిరంజీవితో పాటు ప్రతీ పాత్రను కూడా పూర్తిగా కథకు విలీనం చేసిన పద్దతి కూడా అదిరిపోయిందంటున్నారు వాళ్లు.

Sye Raa Narasimha Reddy movie censor review and Chiranjeevi will live up the expectations pk సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం కేవలం చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పైగా తెలుగుతో పాటు ఐదు భాషల్లో విడుదల కానుండటంతో అక్కడా సైరాపై భారీ అంచనాలున్నాయి. sye raa,sye raa movie,sye raa movie twitter,sye raa movie censor,sye raa censor review,sye raa movie censor review,sye raa preveiw,chiranjeevi sye raa narasimha reddy,telugu cinema,సైరా,సైరా నరసింహా రెడ్డి,సైరా రివ్యూ,సైరా సెన్సార్ రివ్యూ,చిరంజీవి సైరా రివ్యూ,తెలుగు సినిమా
సైరా పోస్టర్ (Source: Twitter)

ఫస్టాఫ్ అంతా ఉయ్యాలవాడ పాత్ర పరిచయం.. బ్రిటీష్ వాళ్లపై ఆయనకు ఉన్న కోపం, ద్వేషాన్ని చూపించి.. ఇంటర్వెల్ నుంచి అసలైన దండయాత్రను చూపించారని తెలుస్తుంది. ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం కూడా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. 250 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించాడు చరణ్. క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి ప్రాణంగా నిలబడతాయని.. ఉయ్యాలవాడను ఉరి తీసే సన్నివేశాలు కూడా సురేందర్ రెడ్డి చాలా చాకచక్యంగా తెరకెక్కించాడని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. పాజిటివ్ రెస్పాన్స్‌తోనే సెన్సార్ పూర్తి చేసుకున్న సైరా.. రేపు థియేటర్లలో ఎలాంటి దండయాత్ర చేయబోతుందో..?

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు