‘సైరా నరసింహా రెడ్డి’ 5 డేస్ కలెక్షన్స్.. ఐదో రోజు చిరంజీవి మెగా ప్రభంజనం..

సైరా తెలుగులో సత్తా చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్ర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 5 రోజుల్లో 70 కోట్ల మార్క్ అందుకుంది సైరా. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు చిరంజీవి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 7, 2019, 2:32 PM IST
‘సైరా నరసింహా రెడ్డి’ 5 డేస్ కలెక్షన్స్.. ఐదో రోజు చిరంజీవి మెగా ప్రభంజనం..
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
సైరా నరసింహా రెడ్డి తెలుగులో సత్తా చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్ర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 5 రోజుల్లో 70 కోట్ల మార్క్ అందుకుంది సైరా. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు చిరంజీవి. తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా కనిపిస్తుంది. నైజాంలో 19.70 కోట్ల షేర్ అందుకుంది.. ఆంధ్రాలో కూడా 50 కోట్ల మైలురాయి అందుకుంది సైరా. వీకెండ్‌తో పాటు దసరా సెలవలను సైరా బాగా క్యాష్ చేసుకుంటుంది. నాలుగో రోజు కంటే ఐదో రోజు మరింత ఎక్కువగా వసూలు చేసింది సైరా.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


ఏకంగా 9 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. నాలుగో రోజు కంటే కోటిన్నరకు పైగా ఎక్కువగా షేర్ తీసుకొచ్చి మెగాస్టార్ ప్రభంజనాన్ని చూపించింది సైరా. ఓవర్సీస్‌లో కూడా 2 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు తీసుకురావడం లేదు. ఈ చిత్రం అక్కడ 10 కోట్ల మార్క్ అందుకుంది.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రావడం లేదు. కానీ కన్నడలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల షేర్ అందుకుంది.. గ్రాస్ దాదాపు 160 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. మరి ఈ దూకుడు ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>