హోమ్ /వార్తలు /సినిమా /

‘సైరా’ 24 డేస్ కలెక్షన్స్.. ఆ రెండు చోట్ల తప్ప అన్నిచోట్లా చిరంజీవి ఫ్లాప్ షో..

‘సైరా’ 24 డేస్ కలెక్షన్స్.. ఆ రెండు చోట్ల తప్ప అన్నిచోట్లా చిరంజీవి ఫ్లాప్ షో..

సైరా పోస్టర్ Twitter

సైరా పోస్టర్ Twitter

మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 24 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే మారింది.

ఇంకా చదవండి ...

మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 24 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే మారింది. తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల మార్క్ షేర్‌ను అందుకుంది సైరా నరసింహారెడ్డి. పెరిగిన దసరా సెలవులు నైజాంలో ఈ సినిమాకు బాగానే ఉపయోగపడ్డాయి. సెలవుల తర్వాత వీక్ డేస్‌లో బాగా వీక్ అయిపోయింది సైరా. 24వ రోజు కేవలం 6 లక్షల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ. 142 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా.

Sye Raa Narasimha Reddy movie 19 days Worldwide collections and Chiranjeevi movie ended up as a flop pk రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 19 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా.. sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy world wide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 19 days collections,sye raa narasimha reddy movie 19 days collections,sye raa narasimha reddy movie 19 days ww collections,sye raa narasimha reddy movie 19 days worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 19 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)

ఈ చిత్రాన్ని 188 కోట్లకు పైగానే అమ్మాడు నిర్మాత రామ్ చరణ్. తెలుగులో మాత్రమే సైరా హిట్ అయింది. అది కూడా కొన్నిచోట్ల ఇంకా సేఫ్ జోన్‌కు రాలేదు. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం.

Sye Raa Narasimha Reddy movie 19 days Worldwide collections and Chiranjeevi movie ended up as a flop pk రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఇప్పటికే 19 రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టినా.. అమ్మిన రేటు ప్రకారం చూస్తుంటే చాలా.. sye raa,sye raa narasimha reddy,sye raa narasimha reddy world wide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 19 days collections,sye raa narasimha reddy movie 19 days collections,sye raa narasimha reddy movie 19 days ww collections,sye raa narasimha reddy movie 19 days worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 19 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)

హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్కడ వార్ సినిమా సైరాపై దారుణంగా దెబ్బేసింది. తెలుగులో కొన్నిచోట్ల మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 141 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా 47 కోట్లకు పైగా వెనకబడి ఉంది ఈ చిత్రం. ఎటు చూసుకున్నా కూడా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా చాలా దారుణంగా నిరాశ పరిచిందనే చెప్పాలి. 24 రోజులు పూర్తి కావడంతో దాదాపు ఫుల్ రన్ పూర్తైనట్లే ఇక.

First published:

Tags: Chiranjeevi, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు