చిరంజీవి ఫామ్ హౌస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్దమైన సైరా సెట్టింగ్..

చిరంజీవి సైరా సెట్టింగ్ బర్నింగ్

మొన్న కరణ్ జోహార్‌కు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం మరవకముందే..హైదరాబాద్ శివారులో ఉన్న చిరంజీవి ఫామ్ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

  • Share this:
మొన్న కరణ్ జోహార్‌కు సంబంధించిన సెట్‌లో అగ్ని ప్రమాదం మరవకముందే..హైదరాబాద్ శివారులోని మణికొండలోని  చిరంజీవి ఫామ్ హౌస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు అక్కడ  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం వేసిన సెట్స్ అన్ని ఈ ప్రమాదంలో అగ్ని ఆహూతయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫామ్ హౌస్ నిర్వాహకులు..అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శకటాలు.. మంటలను ఆర్పాయి. ఇక సైరా సెట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రమాదంలో సైరా  సినిమా కోసం వేసిన సెట్ పూర్తిగా తగలబడి పోయి కోట్లలో నష్టం వాటిల్లినట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కేరళలో జరిగింది. కేరళలో కొన్ని ఫైట్ సీన్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తైయినట్టు సమాచారం. మిగిలిన ప్యాచ్ వర్క్‌ను ఒక నెలరోజుల్లో షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి..తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 

Sye raa Narasimha Reddy: Fire Accident occurred at chiranjeevi farmhouse.. sye raa movie settings collapsed,sye raa fire accident,syeraa fire accident,chiranjeevi farmhouse agnipramadam,chiranjeevi,chiranjeevi farm house fire accident,fire accident at chiranjeevi farmhouse,sye raa fire accident,sye raa twitter,chiranjeevi twitter,sye raa narasimha reddy chiranjeevi,ram charan surender reddy war,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,megastar chiranjeevi,georgia,syeraa narasimhareddy, shooting,schedule,surender reddy,nayanatara,tamannah bhatia,amitabh bachchan,telugu cinema,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,చిరంజీవి ఫామ్ హౌస్‌లో ఫైర్ యాక్సిడెంట్,కాలి బూడిదైన సైరా సెట్టింగ్,చిరు ఫామ్ హౌస్,చిరంజీవి ఫామ్ హౌస్,చిరంజీవి ఫామ్‌ హౌస్‌లో ఫైర్ యాక్సిడెంట్,చిరంజీవి ఫామ్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం,
చిరంజీవి ఫామ్ హౌస్‌లో అగ్ని ప్రమాదం


ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు జగపతిబాబు, సుదీప్,విజయ్ సేతుపతి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నయనతార,తమన్నా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అనుష్క కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.First published: