సైరా రికార్డుల వేట... అప్పుడే రూ. 40 కోట్లు...

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందనే దానిపై అప్పుడే ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాయి.

news18-telugu
Updated: September 11, 2019, 12:52 PM IST
సైరా రికార్డుల వేట... అప్పుడే రూ. 40 కోట్లు...
Instagram/alwaysramcharan
  • Share this:
టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సైరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందనే దానిపై అప్పుడే ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్లు ఏ రేంజ్‌లో ఉంటాయనే అంశాన్ని కాసేపు పక్కనపెడితే... విడుదలకు ముందే ఈ సినిమా రూ. 40 కోట్లు కొల్లగొట్టిందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ సినిమా డిజిటల్‌ హక్కుల్ని రూ. 40 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్టు సమాచారం.

సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడం... ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతుండటం... డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోవడానికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా హక్కుల్ని ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను చిరంజీవి తనయుడు, క్రేజీ హీరో రామ్ చరణ్ నిర్మించారు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్‌లో ఆడియెన్స్ ముందుకు రానుంది.


First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు