సంక్రాంతికి సైరా నరసింహా రెడ్డి.. రిపబ్లిక్ డేకు సాహో..

2019లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రెండు భారీ సినిమాలు సైరా, సాహో. చిరంజీవి, ప్రభాస్ నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకటి తెలుగులో బాగా ఆడితే.. మరొకటి హిందీ ఆడియన్స్‌కు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 9, 2020, 6:47 PM IST
సంక్రాంతికి సైరా నరసింహా రెడ్డి.. రిపబ్లిక్ డేకు సాహో..
సాహో సైరా పోస్టర్స్ (source: Twitter)
  • Share this:
2019లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రెండు భారీ సినిమాలు సైరా, సాహో. చిరంజీవి, ప్రభాస్ నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకటి తెలుగులో బాగా ఆడితే.. మరొకటి హిందీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. ఈ రెండు సినిమాలు వచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు టీవీకి అయితే రాలేదు. ఇప్పుడు అది కూడా జరగబోతుంది. సంక్రాంతికి ఓ సినిమా.. గణతంత్ర దినోత్సవం రోజు ఓ సినిమా రాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా సైరా సినిమాను జెమినీ టీవీలో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే ప్రోమోలు కూడా సందడి చేస్తున్నాయి.

Sye Raa Narasimha Reddy and Saaho movie is going to be premiered in Television on festival season pk 2019లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రెండు భారీ సినిమాలు సైరా, సాహో. చిరంజీవి, ప్రభాస్ నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకటి తెలుగులో బాగా ఆడితే.. మరొకటి హిందీ ఆడియన్స్‌కు.. saaho zee tv,sye raa gemini tv,sye raa sankranti in gemini tv,saaho republic day zee tv,sye raa,sye raa business,chiranjeevi sye raa movie,sye raa saaho movie,prabhas saaho,sye raa pre release business,saaho pre release business,sye raa east godavari rights,telugu cinema,సైరా,సైరా సంక్రాంతి,సాహో రిపబ్లిక్ డే,సాహో సైరా,చిరంజీవి సైరా,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,తూర్పు గోదావరి సైరా బిజినెస్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


పండక్కి కచ్చితంగా ఈ సినిమా రికార్డ్ రేటింగ్స్ సాధిస్తుందని నమ్ముతున్నారు ఛానెల్ యాజమాన్యం. పైగా సైరా సినిమాను భారీ రేట్ పెట్టి సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రం 100 కోట్లకు పైగానే షేర్ సాధించి ఇక్కడ హిట్ అయింది కానీ హిందీలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇక సాహో పరిస్థితి మరోలా ఉంది. అమెజాన్ కారణంగా ఇప్పటికీ ఇంకా తెలుగులో ఈ చిత్రం శాటిలైట్ కాలేదు.

Sye Raa Narasimha Reddy and Saaho movie is going to be premiered in Television on festival season pk 2019లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రెండు భారీ సినిమాలు సైరా, సాహో. చిరంజీవి, ప్రభాస్ నటించిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకటి తెలుగులో బాగా ఆడితే.. మరొకటి హిందీ ఆడియన్స్‌కు.. saaho zee tv,sye raa gemini tv,sye raa sankranti in gemini tv,saaho republic day zee tv,sye raa,sye raa business,chiranjeevi sye raa movie,sye raa saaho movie,prabhas saaho,sye raa pre release business,saaho pre release business,sye raa east godavari rights,telugu cinema,సైరా,సైరా సంక్రాంతి,సాహో రిపబ్లిక్ డే,సాహో సైరా,చిరంజీవి సైరా,సైరా ప్రీ రిలీజ్ బిజినెస్,తూర్పు గోదావరి సైరా బిజినెస్,తెలుగు సినిమా
సాహో మూవీ పోస్టర్ (Source: Twitter)


ఓ డీల్ అనుకున్నా కూడా ఇప్పటికీ అది తెగలేదు. దాంతో ఆర్నెళ్లు దాటినా ఇంకా సాహో టీవీలో రాలేదు. అయితే హిందీలో మాత్రం జీ టీవీ దీన్ని భారీ రేట్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. దాంతో రిపబ్లిక్ డే కానుకగా తొలిసారి ఈ చిత్రాన్ని జీలో ప్రదర్శించబోతున్నారు. హిందీలో సాహో 150 కోట్లకు పైగానే వసూలు చేసింది. దాంతో అక్కడ ఈ చిత్రానికి రేటింగ్స్ పరంగా ఢోకా ఉండదనే భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు టీవీలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాయో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: January 9, 2020, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading