‘సైరా’ 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎదురీదుతున్న మెగాస్టార్..

సైరా నరసింహా రెడ్డి విడుదలై అప్పుడే 12 రోజులు గడిచిపోయింది. ఈ చిత్రం తెలుగులో సత్తా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2019, 4:13 PM IST
‘సైరా’ 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎదురీదుతున్న మెగాస్టార్..
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
సైరా నరసింహా రెడ్డి విడుదలై అప్పుడే 12 రోజులు గడిచిపోయింది. ఈ చిత్రం తెలుగులో సత్తా చూపిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 12 రోజుల్లో 100 కోట్ల షేర్ అందుకుంది సైరా. ఇది కేవలం తెలుగు వర్షన్.. అందులో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేసాడు చిరంజీవి. తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా కనిపిస్తుంది. నైజాంలో 31 కోట్ల షేర్ అందుకుని.. లాభాల్లోకి వచ్చేసింది ఈ చిత్రం. ఆంధ్రాలో కూడా 72 కోట్ల మైలురాయి అందుకుంది సైరా.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


వీకెండ్‌తో పాటు దసరా సెలవలను సైరా బాగా క్యాష్ చేసుకుంది సైరా. తెలంగాణలో మరో వారం సెలవులు రావడంతో సైరాకు మరింత కలిసి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మెగాస్టార్ ప్రభంజనం కనిపిస్తుంది. ఓవర్సీస్‌లో కూడా 2.5 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు తీసుకురావడం లేదు. ఈ చిత్రం అక్కడ 10 కోట్ల షేర్ అందుకుంది అంతే. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు 99.93 కోట్ల షేర్ వసూలు చేసిన సైరా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 135 కోట్ల షేర్ వసూలు చేసింది.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)
బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేసిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రావడం లేదు. కానీ కన్నడలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల షేర్ అందుకుంది.. గ్రాస్ 210 కోట్లకు పైగానే ఉంది. ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్.

సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు 135 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైజాంతో పాటు ఉత్తరాంధ్ర, నెల్లూరులో మాత్రమే సేఫ్ అయింది ఈ చిత్రం. మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. మొత్తానికి సైరాతో చిరు ప్రయాణం ఎక్కడ ఆగనుందో చూడాలిక.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>