సైరా కొత్త సాంగ్ విడుదల...భారతాంబ ముద్దుబిడ్డ అవురా...

బ్రిటిష్ వాళ్ల ఆగడాలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ రకంగా అడ్డుకున్నారని... ఆయనకు మిగతా వాళ్లు ఏ రకంగా సహకరించారనే అంశాలు ఈ పాటలో కనిపించాయి.

news18-telugu
Updated: September 30, 2019, 11:13 AM IST
సైరా కొత్త సాంగ్ విడుదల...భారతాంబ ముద్దుబిడ్డ అవురా...
‘సైరా నరసింహారెడ్డి’ (twitter/Photo)
  • Share this:
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సైరా మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలోని ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ అవురా.. ఉయ్యాలవాడ నరసింహుడా.. చరిత్రపుటలు విస్మరించ వీలులేని వీర.. రెనాల్టీ సీమ కన్న సూర్యుడా.. నింగి శిరసు ఒంచి నమోస్తు నీకు అనగా.. నవోదయానివై జయించినావురా.. ఓ సైరా’ అంటూ నరసింహారెడ్డి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్న ఈ పాట సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. మూవీ యూనిట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ పాట మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.

బ్రిటిష్ వాళ్ల ఆగడాలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏ రకంగా అడ్డుకున్నారని... ఆయనకు మిగతా వాళ్లు ఏ రకంగా సహకరించారనే అంశాలను ఈ పాటలో కొంతవరకు తెలియజేశారు. సినిమాలో నటించిన అందాల భామలు తమన్నా, నయనతార ఈ పాట కనిపించారు. అమిత్‌ త్రివేది అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఈ పాటతో మరోసారి తన సత్తా చాటుకుంది సింగర్ శ్రేయా గోశాల్. అక్టోబర్ 2న ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Published by: Kishore Akkaladevi
First published: September 30, 2019, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading