సైరా ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..

Sye Raa first day collections : చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ భారీ అంచనాలతో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

news18-telugu
Updated: October 3, 2019, 8:13 AM IST
సైరా ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..
Twitter/KonidelaPro
  • Share this:
Sye Raa first day collections: చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ భారీ అంచనాలతో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా  విడుదలైంది. స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించాలని ఎప్పటినుండో వేచి చూస్తున్న మెగాస్టార్ కోరిక ఈ సైరాతో తీరిపోయింది. తండ్రి అపురూపమైన కోరికను కొడుకు రామ్ చరణ్ ప్రొడ్యుసర్‌గా మారి.. భారి హంగులతో ఈ సినిమాను నిర్మించి అదరగొట్టాడు. దాదాపు రూ. 270 కోట్ల భారీ బడ్జెట్‌లో కొణెదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించగా.. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజీటీవ్ టాక్‌తో దూసుకెళ్తుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. మరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. సైరా తొలిరోజు దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియాలో బాక్సాఫీసు దగ్గర చక్కటి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.


సైరా.. సినిమా అమెరికా ప్రీమియర్‌ షోలలో 308 లొకేషన్లలో 8,57,765 డాలర్స్ అంటే దాదాపు రూ.6.16 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా అటూ ఆస్ట్రేలియాలో 39 లొకేషన్లలో A$ 189,237 సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా అమెరికాలో వన్‌ మిలియన్‌ మార్కును ఆల్రేడీ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో.. లాభాల బాట పట్టడానికి ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు