Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: September 27, 2019, 12:35 PM IST
సురేందర్ రెడ్డి: 7 కోట్లు (సైరా తర్వాత ఈయన కూడా భారీగానే తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది..)
సైరా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ఈ సినిమాను ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ తెరకెక్కిస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న విడుదల కానున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి రెండు ట్రైలర్లు కూడా విడుదల అయ్యాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను దేశభక్తిని చాటేలా తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన్ను దేశభక్తి గురించి ప్రశ్నలు వేయగా ఓ ఆసక్తికర జవాబిచ్చారు. ఆరెస్సెస్ వల్లే తనకు దేశభక్తి, క్రమశిక్షణ పెరిగిందని వ్యాఖ్యానించారు.
‘నేను చిన్నప్పటి నుంచే సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్నా. అది ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచేది. ఆ స్కూల్లో చదువుకోవడం వల్ల దేశభక్తి, గౌరవం, క్రమశిక్షణ వచ్చాయి. అక్కడ స్కూళ్లో నేర్పిన సంస్కారమే నన్ను ఈ స్థాయిలో ఉంచింది. డైరెక్టర్‌ను చేసింది. డైరెక్టర్‌గా నేను ఇప్పుడు రాణిస్తున్నానంటే అప్పుడు వారు నేర్పిన మంచి పాఠాలే’ అని తెలిపారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
September 27, 2019, 12:35 PM IST