‘స్వాతి చినుకులు’ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్..

COVID-19: బుల్లితెరను మెల్లగా కమ్మేస్తుంది కరోనా వైరస్. వీటి షూటింగ్ మొదలు కావడంతో కరోనా కూడా విజృంభిస్తుంది. మెల్లమెల్లగా అందరికీ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 4:01 PM IST
‘స్వాతి చినుకులు’ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్..
స్వాతి చినుకులు భరద్వాజ్ (swathi chinukulu bharadwaj)
  • Share this:
బుల్లితెరను మెల్లగా కమ్మేస్తుంది కరోనా వైరస్. వీటి షూటింగ్ మొదలు కావడంతో కరోనా కూడా విజృంభిస్తుంది. మెల్లమెల్లగా అందరికీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సినిమాల షూటింగ్స్ అయితే ఇంకా మొదలు కాలేదు కానీ సీరియల్స్ మాత్రం శరవేగంగా నడుస్తున్నాయి. మూడు నెలలుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఆ గ్యాప్ అంతా ఇప్పుడు బ్రేక్ లేకుండా కొట్టేస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నా కూడా కరోనా మాత్రం వాళ్లను వదిలిపెట్టడం లేదు.
నవ్య స్వామి Photo : Youtube
నవ్య స్వామి Photo : Youtube


ఇప్పటికే తెలుగు బుల్లితెర నటులు నవ్య స్వామి, రవికృష్ణ, సాక్షి శివ, ప్రభాకర్ లాంటి వాళ్లు కరోనా బారిన చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇప్పుడు మరో నటుడు కూడా కరోనా బారిన పడ్డాడు. స్వాతి చినకులు సీరియల్ నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. స్వాతి చినుకులు సీరియల్‌తో పాటు బంధం అనే టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భరద్వాజ్ కరోనా బారిన పడ్డట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.

అయితే కరోనా లక్షణాలు తనకి లేవని.. మంచి డైట్‌తో పాటు మందులు వాడితే ఈ మహమ్మారిని నుండి బయటపడొచ్చని చెప్పుకొచ్చాడు భరద్వాజ్. తనతో కాంటాక్ట్ అయిన వాళ్ళు టెస్ట్‌లు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్‌లో ఉండాలని కోరాడు ఈయన. స్వాతి చినకులు టీం అంతా ఇప్పుడు భయంభయంగా ఉండిపోయింది. వాళ్లంతా వెంటనే టెస్టులు చేయించుకోడానికి ముందుకొస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading