Home /News /movies /

SWATANTRA VEER SAVARKAR BIOPIC RANDEEP HOODA TO PLAY ICONIC LEGENDERY REAL HERO SAVARKAR ROLE AND FIRST LOOK RELEASED TA

Swatantra Veer Savarkar : ఎన్టీఆర్ విలన్ డైరెక్షన్‌లో బాలీవుడ్ తెరపై ‘వీర్ సావర్కర్’ బయోపిక్.. ఫస్ట్ లుక్ విడుదల..

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

Swatantra Veer Savarkar: ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రోజు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వీర్ సావర్కర్ 139వ జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Swatantraveer Savarkar: గత కొన్నేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, హీరోలు, స్పోర్ట్స్ పర్సన్స్, మాపియా డాన్స్ ఇలా ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఆకట్టుకునే అంశం ఉంటే.. ఆయా దర్శక, నిర్మాతలు, హీరోలు అటువంటి సబ్జెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో గత కొన్నేళ్లుగా ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులు వ్యక్తుల జీవితాలను వెండితెరపై తెరకెక్కిస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర పోరాటంలో తన ముప్పావు జీవితాన్ని జైల్లో గడిపిన స్వాతంత్య్ర వీరుడు సాహసి అయిన వీర్ సావర్కర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన 139వ జయంతి పురస్కరించుకొని ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో ఓ సినిమాను అనౌన్స్ చేసారు. మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆనంద్ పండిత్, సందీప్ సింగ్, సామ్ ఖాన్ ఈ సినిమాను భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితాన్ని ఎక్కువగా గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరించనున్నారు. అందులో భాగంగా అండమాన్ దీవుల్లోని సావర్కర్ జైలు ఒకప్పుడు ఈ జైలును సెల్యూలర్ జైలు పేరుతో పిలిచేవారు. దీనికి మరో పేరు ‘కాలా పానీ’గా వ్యవహరించేవారు. దేశం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈయన జీవితాన్ని భావి తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నట్టు చిత్ర దర్శక, నిర్మాతలు తెలియజేసారు.

F3 - 1st Day WW Collections : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ మూవీ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసారు. అందులో గాంధీ, నెహ్రూ, సర్ధార్ పటేల్, భగత్ సింగ్, నేతాజీ వంటి కొద్ది మంది జీవిత చరిత్రలు మాత్రమే తెలుసు. వీళ్లతో పాటు స్వాతంత్య్ర  పోరాటంలో తమ జీవితాలను సమిధలుగా చేసుకొని సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల్లో ‘వినాయక్ దామోదర్ సావర్కర్’ ఒకరు. అందురు ఈయనను ’వీర్ సావర్కర్’గా గా  పిలుస్తారు. ఆయన గురించి ప్రజలకు పూర్తి నిజాలు తెలియదు. ఆయన జీవిత ప్రయాణంలో వివిధ మజిలీలను ఈ బయోపిక్‌లో ప్రస్తావించనున్నట్టు చిత్ర దర్శక, నిర్మాతలు తెలియజేసారు. ఇక వీర్ సావర్కర్ పాత్రలో రణ్‌దీప్ హుడా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈయన లుక్ చూస్తుంటే.. అచ్చు సావర్కర్‌ అన్నట్టుగా ఉంది. అంతా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు. ఈ పోస్టర్‌లో హిందుత్వ అనేది ధర్మ్ నహీ.. ఇతిహాస్ హై.. అంటే హిందూత్వం అంటే ధర్మం కాదు. ఒక చరిత్ర అంటూ కోడ్ రాసారు.

వీర సావర్కర్ పాత్రలో రణ్‌దీప్ హుడా (Twitter/Photo)


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ జీవితం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. మరోవైపు డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ఇలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను తనకు తెరకెక్కించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నారు. ఈ సినిమా నిర్మాణం తనకు సవాలుతో కూడుకున్న వ్యవహారం అన్నారు. రణ్‌దీప్ హుడాతో పాటు  మరో ఇద్దరు ముగ్గురు హీరోలకు ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాను ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్, లెజెండ్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఆగష్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.  మొత్తంగా వెండితెరపై ‘స్వతంత్య్రవీర్ సావర్కర్’ సినిమా ఎలాంటి సంచలనాలకు నాంది పలుకుతుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Mahesh Manjrekar, Randeep Hooda, Swatantraveer Savarkar

తదుపరి వార్తలు