ఒకానొక సమయంలో ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy). టాలీవుడ్ లో ఎందరో నటీనటులకు లైఫ్ ఇస్తూ ఎవర్ గ్రీన్ హిట్స్ అందించిన ఆయన కామెడీ ఓరియెంటెడ్ సినిమాలు తనదైన కోణంలో ప్రెజెంట్ చేసేవారు. అయితే సినిమాల పరంగా కాస్త గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇప్పుడు మోడ్రన్ ప్రేక్షకుల కోసం మరో వినోదాత్మక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు (Organic Mama Hybrid Alludu) అనే పేరుతో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు కె. అచ్చిరెడ్డి (K Acchi Reddy) సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), సీనియర్ నటి మీనా (Meena) ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేం సోహెల్ (Syed Sohel), మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ చేపట్టి ప్రేక్షకుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా అప్ డేట్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
మార్చి 3న ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. ఈ సినిమాలో సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సి. రాంప్రసాద్ కెమెరా వర్క్స్ చూసుకోగా.. ఎడిటింగ్ బాధ్యతలు ప్రవీణ్ పూడి చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss Sohel, Meena, Rajendra Prasad, Sv krishna reddy