Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 6, 2020, 2:10 PM IST
శ్రీజ సుష్మిత నిహారిక కొణిదెల (sushmita sreeja niharika)
నిహారిక పెళ్లి సందడి సోషల్ మీడియాలో మామూలుగా లేదు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో నిహా పెళ్లి జరగనుంది. డిసెంబర్ 9న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. హీరోలు చేరుకోలేదు కానీ మెగా ఆడవాళ్లు మాత్రం అంతా అక్కడికి వెళ్లిపోయారు. ఇప్పటికే చిరంజీవి కూతుళ్లు, కోడళ్లు, మనవరాళ్లు అందరూ అక్కడే ఉన్నారు. చిరంజీవి ఆచార్య షూటింగ్ రెండు రోజులు పూర్తి చేసి నేరుగా పెళ్లికి వెళ్లనున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఇదే చేయబోతున్నారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా డిసెంబర్ 7 సాయంత్రం రాజస్థాన్ వెళ్లనున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అమ్మాయిలు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక పెళ్లిని ఓ పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ అయితే తమ స్టైలింగ్ మొత్తం చూపించేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చిరు పెద్ద కూతురు సుష్మిత ఇప్పటికే కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శ్రీజ నిహారిక కొణిదెల (sreeja niharika)
మరోవైపు శ్రీజ కూడా తన చెల్లితో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే అన్నింట్లోనూ ఒక్క ఫోటో మాత్రం ఇప్పుడు బాగా ఆకట్టుకుంటుంది. అదే మెగా అక్కాచెల్లెళ్లు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో. అందులో చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజతో పాటు కొత్త పెళ్లికూతురు నిహారిక కూడా ఉంది. ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను శ్రీజ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది రచ్చ రచ్చ చేస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 6, 2020, 2:09 PM IST