జిమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో సుస్మితాసేన్.. చెమటలు పట్టించే హాట్ వర్కౌట్స్..

Sushmita Sen : బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ లేటు వయసులోనూ సెక్సీ ఫిగర్‌తో అదరగొడుతోంది. తన హాట్ అందాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొంటూ ఫాలోయర్లను కట్టిపడేస్తున్న ఈ సుందరి.. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ రోహ్‌మన్ షాల్‌తో కలిసి జిమ్‌లో చెమటలు కక్కేలా చేసిన వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: September 13, 2019, 12:30 PM IST
జిమ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో సుస్మితాసేన్.. చెమటలు పట్టించే హాట్ వర్కౌట్స్..
సుస్మితా సేన్ (Photo: Instagram)
  • Share this:
బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్ లేటు వయసులోనూ సెక్సీ ఫిగర్‌తో అదరగొడుతోంది. తన హాట్ అందాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొంటూ ఫాలోయర్లను కట్టిపడేస్తున్న ఈ సుందరి.. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ రోహ్‌మన్ షాల్‌తో కలిసి జిమ్‌లో చెమటలు కక్కేలా చేసిన వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేసింది. తన బ్యాక్‌ను రోహ్‌మన్ కాళ్లపై ఆనించి శరీరాన్ని సాగదీస్తూ తీసిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా, సుస్మితాసేన్ తన బాయ్‌ఫ్రెండ్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. 42 ఏళ్ల ఈ బ్యూటీ తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్‌మన్‌ షాల్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలుస్తున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.

బాయ్‌ఫ్రెండ్‌తో సుస్మితా సేన్ (Photo: Instagram)


రోహ్‌మన్‌ మోడల్‌గా రాణిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ ఫ్యాషన్‌ షోలో సుస్మిత, రోహ్‌మన్‌ కలుసుకొన్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటంతో అప్పటి నుంచి కలిసే తిరుగుతున్నారు. ఇప్పటికే రోహ్‌మన్‌ సుస్మితకు ప్రపోజ్‌ చేయడం, ఆమె ఓకే అనడంతో పెళ్లికి లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. సుస్మిత పెంచుకొంటున్న ఇద్దరు పిల్లలు రీనీ, అలీష్‌కు కూడా రోహ్‌మన్‌ అంటే ఇష్టపడ్డట్లు సమాచారం.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు