సుశాంత్ సింగ్, సారా అలీఖాన్ ‘కేదార్‌నాథ్’ ట్రైలర్ టాక్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కేదార్ నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీతో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

news18-telugu
Updated: November 12, 2018, 5:02 PM IST
సుశాంత్ సింగ్, సారా అలీఖాన్ ‘కేదార్‌నాథ్’ ట్రైలర్ టాక్
కేదార్ నాథ్ మూవీ
  • Share this:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కేదార్ నాథ్’. అభిషేక్ కపూర్ డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీతో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హిమాలయాల్లోని ఛార్‌ధామ్‌లో ఒకటైన ‘కేథార్‌నాథ్’ ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్‌పై ఒక వర్గం వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ మూవీలో అసభ్యకరంగా ముద్దు సన్నివేశాలున్నాయంటూ కేథార్‌నాథ్ గుడికి సంబంధించిన పూజారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో అభ్యంతకరంగా ఉన్న సన్నివేశాలు తొలిగొంచకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. సినిమాపై వివాదం రేగుతున్న ఈ సమయంలో ఈ చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.


ఈ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..కేదార్‌నాథ్‌లో డోలివాలాగా స్థిర పడిన ముస్లిమ్ యువకుడి పాత్రలో నటించాడు. మరోవైపు  సారా అలీ ఖాన్..భక్తురాలి పాత్రలో నటించింది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. దీనికి పెద్దల అంగీకారం ఉండదు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని వరదలు ముంచెత్తుతాయి. మాములు లవ్ స్టోరీకి కేదార్‌నాథ్ క్షేత్రానికి లింక్ చేసి ఈ మూవీకి ఈ పేరును పెట్టినట్టు కనబడుతుంది. ఈ మూవీని డిసెంబర్7న విడుదల చేయనున్నారు.

First published: November 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు