బందిపోటుగా ‘ఎం.ఎస్.ధోని’..రిలీజైన ‘సోన్ చిడియా’ ట్రైలర్

రీసెంట్‌గా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘కేదార్‌నాథ్’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఈ హీరో..‘సోన్ చిడియా’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ సరసన ‘టాయిలెట్’ ఫేమ్ భూమి పెడ్నేకర్ కథానాయికగా నటిస్తోంది.

news18-telugu
Updated: January 7, 2019, 3:50 PM IST
బందిపోటుగా ‘ఎం.ఎస్.ధోని’..రిలీజైన ‘సోన్ చిడియా’ ట్రైలర్
‘నోన్ చిడియా’ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
  • Share this:
‘కై పోచే’, ‘శుద్ దేశీ రొమాన్స్’ ‘పీకే’ చిత్రాలతో టాలెంటెడ్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. మరోవైపు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని జీవిత కథపై తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ తో నటుడిగా మంచి మార్కులే కొట్టేశాడు.

రీసెంట్‌గా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘కేదార్‌నాథ్’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఈ హీరో..‘సోన్ చిడియా’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ సరసన ‘టాయిలెట్’ ఫేమ్ భూమి పెడ్నేకర్ కథానాయికగా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘ఇష్కియా’, ‘ ఉడ్తా పంజాబ్’ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్ చౌబే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ఛంబల్ లోయలోని బందిపోటు దొంగల ఇతివృత్తంతో తెరకెక్కించారు. బంగారం లాంటి గనులను ప్రభుత్వం ఎలా కార్పోరేట్లకు దోచిపెడుతుంది. దానికి స్థానికంగా ప్రజలు ఎలా బలయ్యారనే కథాంశంతో అభిషేక్ చౌబే ఈసినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది.

‘సోన్ చిడియా’ అంటే బంగారు బాతు అనే అర్థంలో ఈ సినిమా టైటిల్ ఉంది. ఇందులో బందిపోటు దొంగలుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, మనోజ్ వాజ్‌పేయి నటన బాగుంది. అలాగే బందిపోట్లను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా అశుతోష్ రానా నటన బాగుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నారు.
First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు