• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SUSHANT SINGH RAJPUT SUICIDE CAST ATE KEY PAGES IN HER PERSONAL DIARY STRENGTHENING SUSPICIONS TA

సుశాంత్ పర్సనల్ డైరీలో కీలక పేజీలు మాయం...బలపడుతున్న అనుమానాలు..

సుశాంత్ పర్సనల్ డైరీలో కీలక పేజీలు మాయం...బలపడుతున్న అనుమానాలు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్(ఫైల్ ఫోటో)

Sushant Singh Rajput | లోతుగా వెళ్లే కొద్ది సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి.

  • Share this:
    లోతుగా వెళ్లే కొద్ది సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో పలు కోణాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్‌ను కావాలనే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై ఏ1 గా చేరుస్తూ కేసు ఫైల్ చేసింది. మరోవైపు ఈ సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తి తల్లి తండ్రులను సోదరుడితోొ పాటు శామ్యూల్ మిరిండా, శృతి మోడీలను నిందితులుగా చేర్చింది సీబీఐ. మరోవైపు సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో కన్నుమూసిన జూన్ 14 ముందు రియా చక్రబర్తికి సుశాంత్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో రియాకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలుస్తోంది. సుశాంత్‌కు చెందిన కొటక్, హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి ఈ నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులతో రియా కుటుంబ సభ్యులు ముంబైలో కమర్షియల్ ఏరియాలో  రెండు ప్రాపర్టీలు కొనుగోలు చేసారా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

    Sushant Rajput Case, rhea chakrabarthy, sushanth death case news, sushanth suicide or murder, sushanth ed case, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సుశాంత్ డెత్ కేసు, రియా చక్రవర్తి
    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. Photo : Twitter


    మరోవైపు ఈ కేసులో కీలకమైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు మిస్ అయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనడానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ డైరీలో సుశాంత్ తన రోజువారీ సంబంధించిన విషయాలను రాసేవాడేని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, లాయర్ షెహదాద్ పూనావాలా కూడా డైరీలో పేజీలు మాయమైన విషయాన్ని ప్రస్తావించారు. ముంబై పోలీసులు కావాలనే ఈ విషయాన్ని తెలియకుండా చేసారన్నారు. అందుకే సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని వాళ్లు కోరిన సంగతి తెలిసిందే కదా. కేంద్రం కూడా వెంటనే సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ ఆదేశించింది. ఈ వెను వెంటనే ఈ కేసు విషయమై సీబీఐ రంగంలోకి దిగింది.

    CBI registers FIR against Rhea Chakraborty over sushant singh rajput suicide case,CBI registers FIR against Rhea Chakraborty,cbi,central Bureau of investigation,rhea chakraborty,sushant singh rajput,sushant singh rajput cbi enquiry,supreme court green signal to cbi enquiry on sushant singh rajput,satish maneshinde,rhea chakraborty lawyer,lawyer satish maneshinde,rhea chakraborty news,rhea chakraborty family,satish maneshinde rhea chakraborty,rhea chakraborty satish maneshinde,rhea chakraborty lawyer satish maneshinde,satish maneshinde fees,satish maneshinde salman khan,rhea chakraborty and sushant singh rajput,sushant singh rajput rhea chakraborty,satish maneshinde rhea,rhea chakraborty lawyer satish,satish maneshinde fight for rhea,rhea hires satish manasinde,sushant singh rajput rhea chakraborty,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్,రియా చక్రవర్తి,రియా చక్రవర్తి లాయర్ సతీష్ మన్షిండే,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ,సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి నేపథ్యంలో రియా చక్రబర్తికి ఈడీ సమన్లు,రియా చక్రబర్తిపై సీబీఐ కేసు నమోదు,రియా చక్రబర్తిపై సీబీఐ కేసు నమోదు
    రియా చక్రబర్తిని ఏ1 నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ కేసు నమోదు (Twitter/Photo)


    ఇప్పటికే సీబీఐ ముంబై పోలీసులతో పాటు బిహార్ పోలీసుల నుంచి ఈ కేసు విషయమై పలు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఐతే.. బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయమై ఎంక్వైరీకి  సీబీఐకు అధికారులకు ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. కానీ ఈ సుశాంత్.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐకు ప్రత్యేక అనుమతి ఇస్తే కానీ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు.ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి.. సీబీఐ దర్యాప్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తప్పనిసరి అంటున్నారు. ఐతే..సీబీఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. ఫెడరల్ దర్యాప్తుకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదనేది సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు చెబుతున్నారు. మొత్తంగా సీబీఐ ఎంక్వైరీతో సుశాంత్ మృతి వెనక ఉన్న అసలు రహస్యాలు బయటకు వస్తాయనే ఆశలో ఆయన అభిమానులున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు