హోమ్ /వార్తలు /సినిమా /

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ముందు బెల్ట్‌తో కూడా..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ముందు బెల్ట్‌తో కూడా..

ఆయన చనిపోయిన తర్వాత చూస్తే అవన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు పని చేసే వ్యక్తి. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు,

ఆయన చనిపోయిన తర్వాత చూస్తే అవన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు పని చేసే వ్యక్తి. ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితుడు,

Sushant Singh Rajput: ఎన్ని అనుకుని ఏం లాభం.. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా అందరి మధ్యలోంచి వెళ్లిపోయాడు అంటూ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఇప్పటికీ బాధ..

ఎన్ని అనుకుని ఏం లాభం.. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అర్ధాంతరంగా అందరి మధ్యలోంచి వెళ్లిపోయాడు అంటూ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ఇప్పటికీ బాధ పడుతున్నారు అభిమానులు. ఆయన చనిపోయి రెండు వారాలు కావొస్తున్నా కూడా ఇప్పటికీ సుశాంత్ మరణాన్ని మాత్రం మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన ధ్యాసలోనే ఉన్నారు. మరోవైపు ముంబై పోలీసులు ఈ కేసును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే 23 మంది వాయిస్ రికార్డు తీసుకున్నారు. తాజాగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి కూడా కొందరిని విచారించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)

ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య జరిగిన రోజు ఏం జరిగిందనేది మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ఆ రోజు సుశాంత్ ఒకసారి కాదు రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. చనిపోవడానికి ముందు సుశాంత్ రూమ్‌లో రెండుగా తెగిపడిన ఓ బాత్‌రోబ్ బెల్ట్ దొరికిందని పోలీసులు తెలిపారు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)

అంటే ఓ సారి ఆ బెల్ట్‌తో కూడా ఉరి వేసుకోడానికి సుశాంత్ ప్రయత్నించి ఉంటాడని.. కానీ అతడి బరువుకు అది తెగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయన కర్టన్‌తో ఉరి వేసుకున్నాడు. చనిపోడానికి ముందు వరకు కూడా సుశాంత్ చాలా ఉల్లాసంగా కనిపించాడని అంతా చెప్తున్నా కూడా లోపల మాత్రం చాలా డిప్రెషన్ ఉందని పోలీసుల విచారణలో బయటికి వస్తుంది. కేవలం వారసత్వం లేకపోవడం.. బాలీవుడ్ దూరం పెట్టడం వల్లే ఆ బాధలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించాడని ఆయన అభిమానులు మండి పడుతున్నారు.

First published:

Tags: Bollywood, Hindi Cinema, Sushanth singh Rajputh

ఉత్తమ కథలు