సుశాంత్ సింగ్ కేసు.. సల్మాన్ ఖాన్ మాజీ మేనేజర్‌ను ప్రశ్నించిన పోలీసులు..

Sushant Singh Rajput suicide case: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన నెల రోజుల తర్వాత కూడా విచారణ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని ప్రశ్నించారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 11, 2020, 2:46 PM IST
సుశాంత్ సింగ్ కేసు.. సల్మాన్ ఖాన్ మాజీ మేనేజర్‌ను ప్రశ్నించిన పోలీసులు..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన నెల రోజుల తర్వాత కూడా విచారణ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని ప్రశ్నించారు ముంబై పోలీసులు. ముఖ్యంగా కొందరి నుంచి కీలకమైన సాక్ష్యాలు కూడా తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సల్మాన్ ఖాన్ మాజీ మేనేజర్ రేష్మ శెట్టిని కూడా ప్రశ్నించారు ముంబై పోలీసులు. జులై 10న ఈమెను దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. రేష్మ శెట్టి బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అలియా భట్ లాంటి వాళ్లతో పని చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)


ఈమె సాక్ష్యాలు కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. నిజంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై బాలీవుడ్‌లో గ్రూపిజం నడిచిందా.. ఆయన్ని కొందరు టార్గెట్ చేసారా అనే ప్రశ్నలను రేష్మను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ సహా మరికొందరు సుశాంత్‌ను కావాలనే టార్గెట్ చేసారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అందుకే వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లను కూడా విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సల్మాన్ మాజీ మేనేజర్‌ను కూడా ప్రశ్నించారు. ఈ విచారణలో రేష్మ శెట్టి కూడా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)

తాను కేవలం రెండు సార్లు మాత్రమే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కలిసినట్లు తెలిపింది రేష్మ. అంతేకాదు ఆ రెండు సార్లు కూడా ఎలాంటి డిప్రెషన్‌లో ఉన్నట్లు తనకు కనిపించలేదని.. బాలీవుడ్‌లో తనపై గ్రూపిజం నడిచినట్లు కూడా తనకు ఎప్పుడూ అనిపించలేదని ఈమె పోలీసులకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే 35 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసారు పోలీసులు. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా దిల్ బెచారా జులై 24న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 11, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading