సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పోలీసులకు కీలక ఆధారం..

Sushant Singh Rajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయిందని ముంబై పోలీసులు కూడా చాలా విధాలుగా ఆరా తీస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2020, 2:43 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో పోలీసులకు కీలక ఆధారం..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోపిక్ (sushant singh rajput biopic)
  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయిందని ముంబై పోలీసులు కూడా చాలా విధాలుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ఇంట్లో పని చేసే వాళ్లను.. ఆయన స్నేహితులను.. గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించారు. రియాను అయితే ఏకంగా 11 గంటల పాటు ముంబై పోలీసులు ప్రశ్నించారని తెలుస్తుంది. ఇందులో వాళ్లకు కొన్ని కీలకమైన విషయాలు కూడా తెలిసాయని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినపుడు ఆయన ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు.. పైగా సూసైడ్ నోట్ కూడా లభించలేదు.
గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (File/Photo)
గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (File/Photo)


దాంతో పోలీసులు కూడా దీన్ని అనుమానాస్పద మృతి కింద కాకుండా ఆత్మహత్యగానే ఫైల్ చేసారు. పైగా కుటుంబ సభ్యులు కూడా ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చేసారు. కానీ అభిమానులు మాత్రం సుశాంత్ సింగ్‌కు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య.. ఆయన్ని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారు కాబట్టి ఇది హత్యే అంటున్నారు. ఇవన్నీ ఇలా సాగుతుండగా ఇప్పుడు మరో సంచలన విషయం బయటికి వస్తుంది. రెండేళ్ల కింద ముంబైలో 20 కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొన్నాడు సుశాంత్. ఇందులో ఆయనకు సంబంధించిన కొన్ని ఆధారాలను ముంబై పోలీసులు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput)

ముఖ్యంగా ఆయనకు డైరీ రాసే అలవాటు ఉందని.. అలా 4,5 డైరీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఈ డైరీలు కానీ చదివితే అందులో మరిన్ని విషయాలు తెలుస్తాయని.. అప్పుడు ఈ నటుడు ఎందుకు చనిపోయాడనేది క్లూ దొరుకుతుందనేది ఆలోచిస్తున్నారు ముంబై పోలీసులు. మరోవైపు కేవలం నెపొటిజం కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని అటు అభిమానులు.. ఇటు ఇండస్ట్రీలో కొందరు బలంగా నమ్ముతున్నారు.. ఆరోపిస్తున్నారు కూడా. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
First published: June 19, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading