Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 3, 2020, 3:01 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి (sushant singh rajput)
రక్షాబంధన్ అంటేనే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లకు ప్రత్యేక పండగ. ఆ రోజు ఎక్కడెక్కడో ఉన్న సోదరుడు, సోదరీమణులు వచ్చి ప్రేమకు గుర్తుగా రాఖీ కట్టించుకుంటారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి కూడా ఎమోషనల్ అయింది. రాఖీ పండగ రోజు ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది సుశాంత్ సోదరి. రాఖీ సందర్భంగా తమ అనుబంధాన్ని తమ్ముడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది శ్వేతా సింగ్. రాఖీ శుభాకాంక్షలు.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం.. నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేసింది ఈమె.
అందులో భాగంగానే కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది శ్వేతా సింగ్ కీర్తి. సుశాంత్ మరో సోదరి నీతూ సింగ్ కూడా తమ్ముడిపై ప్రేమను చూపించింది. గుల్షన్, నా బేబీ. .రక్షా బంధన్ రోజు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అయింది. నువ్వు శాశ్వతంగా దూరమైన రక్షా బంధన్ మాకు ఒకటి ఉంటుందని అస్సలు కలలో కూడా ఆలోచించలేదు.. నువ్వు లేకుండా జీవించడం ఎలా నేర్చుకోవాలో నువ్వే చెప్పు అంటూ నీతూ సింగ్ పోస్ట్ చేసింది. ఈ రెండు పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి (sushant singh rajput)
జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది హత్యే అంటూ ఇప్పటికీ వాదనలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియడానికి ఇంకా సమయం పడుతుందని అటు బీహార్ పోలీసులతో పాటు సుశాంత్ సన్నిహితులు కూడా చెప్తున్నారు. మరోవైపు ముంబై పోలీసులతో పాటు రాజకీయ నాయకులు కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తలుచుకుని వాళ్ళ అక్కలు మాత్రం చాలా అంటే చాలా ఏడుస్తున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 3, 2020, 3:01 PM IST