న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీకి సుశాంత్ సింగ్ సోదరి లేఖ..

బాలీవుడ్ వర్దమాన నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోని నెలన్నర కావొస్తోన్న ఆయన మరణంపై రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుశాంత్ మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు.

news18-telugu
Updated: August 1, 2020, 12:55 PM IST
న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీకి సుశాంత్ సింగ్ సోదరి లేఖ..
సుశాంత్ సింగ్ మరణంపై ప్రధాని మోదీకి సుశాంత్ సోదరి లేఖ (Instagram/Photo)
  • Share this:
బాలీవుడ్ వర్దమాన నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోని నెలన్నర కావొస్తోన్న ఆయన మరణంపై రోజుకో మలుపు తిరుగుతోంది.సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ వదిలేసి అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేసినా కూడా ఆ తర్వాత ఆత్మహత్య అని తేల్చేసారు పోలీసులు. ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడు అంటూ పోస్టుమార్టం రిపోర్టులో కూడా బయటికి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ ప్రముఖుల్ని విచారించారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్య స్వామి సుశాంత్ సింగ్‌ను పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తనదైన వాదన లేవనెత్తారు.

sushant singh Rajput death case updates, enforcement directorate investigation sushant singh Rajput death case, ed investigation in sushant singh Rajput death case, rhea chaktraborty news, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఈడీ దర్యాప్తు, రియా చక్రవర్తి
తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తితో సుశాంత్ సింగ్ (Instagram/ photo)


ఇంకోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్.. తన కుమారుడిని అతని గర్ల్ ఫ్రెండ్ రియానే చంపేసిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ కేసు విషయమై బిహార్ పోలీసులు సుశాంత్ వంట మనిషి నీరజ్‌ను పలు కోణాల్లో విచారించారు.తాజాగా ఈ కేసు విషయమై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసారు.ఈ సందర్భంగా ఆమె ఈ లేఖలో నేను సుశాంత్ సింగ్ సోదరిని, నాకు ఈ దేశ న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉంది. తన తమ్ముడు మృతిపై లోతైనా దర్యాప్తు చేపట్టాలంటూ కోరింది. మేం అది సాధారణ కుటుంబం నుంచి వచ్చాము. బాలీవుడ్‌లో నా తమ్ముడికి ఎవరు గాడ్ ఫాదర్‌మా లేరు. అందుకే ఈ కేసులో అన్ని ఆధారాలను పరిశీలించి  మాకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్ధిస్తూ ప్రధానికి లేఖ రాసింది సుశాంత్ సోదరి శ్వేత.  మొత్తంగా సుశాంత్ మరణంపై ఉన్న అసలు నిజాలు వెలికి తీయాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 1, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading