కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క..

Sushant Singh Rajput pet dog: మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాయి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కల్మషం లేని వాటి ప్రేమ ముందు ఎవరి ప్రేమైనా కూడా తక్కువే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2020, 11:08 PM IST
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క..
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)
  • Share this:
మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాయి. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. కల్మషం లేని వాటి ప్రేమ ముందు ఎవరి ప్రేమైనా కూడా తక్కువే. ముఖ్యంగా కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమను ప్రాణంగా చూసే యజమానులు చనిపోయినపుడు అవి కూడా అలాగే ప్రాణాలు విడిచేస్తుంటాయి. ఒక్కోసారి వాళ్ల ధ్యాసలోనే ఉండిపోతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్ని రోజుల కింద ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈయనకు ఫుడ్జ్ అనే పెంపుడు కుక్క ఉంది.
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)
కన్నీరు పెట్టిస్తున్న సుశాంత్ పెంపుడు కుక్క (sushant singh rajput pet dog)


దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు సుశాంత్. రూమ్‌లో ఉన్నపుడు అదే అతడి ప్రపంచం కూడా. దాన్ని ఆడిస్తూ.. ఆడుకుంటూ ఉండేవాడు. అయితే ఇప్పుడు సుశాంత్ మరణం తర్వాత ఆ పెంపుడు కుక్క పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. తలుపు చప్పుడు అయితే చాలు సుశాంత్ వచ్చాడేమో అనుకుని అలా వెళ్ళిపోతుందని.. తీరా అక్కడ అతడు కనిపించకపోయేసరికి వచ్చి నిశ్శబ్ధంగా నేలపై పడిపోతుందని పని మనుషులు చెప్తున్నారు. ఫోన్ స్క్రీన్‌పై సుశాంత్ బొమ్మను పెట్టుకుని అలాగే చూస్తుండిపోతుందని.. ఆఫ్ అయిపోతే కాలితో టచ్ చేసి ఓపెన్ చేసుకుంటుందని సిబ్బంది తెలిపారు.

సుశాంత్ చనిపోయిన రోజు నుంచి కూడా ఎంత ప్రయత్నించినా కూడా కనీసం అది అన్నం తినడం లేదని.. నీళ్లు కూడా తాగకుండా యజమాని కోసం వేచి చూస్తుందని చెప్తున్నారు వాళ్లు. ఫుడ్జ్‌‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పశు వైద్యున్ని సంప్రదించినా కూడా అది అలాగే ఉండిపోతుందని.. ఇలాగే మరికొన్ని రోజులు ఉంటే సుశాంత్ మాదిరే ఇది కూడా దూరమైపోతుందేమో అని బాధ పడుతున్నారు వాళ్లు. ఏదేమైనా కూడా పెంపుడు జంతువులు చూపించే ప్రేమ ఎలా ఉంటుందనేది ఇప్పుడు సుశాంత్ పెంచుకున్న కుక్కను చూస్తుంటే అర్థమైపోతుంది.
First published: June 19, 2020, 11:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading