చందమామపై స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్...

susఅవును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో కలిచివేసాయి. అయితే.. ఏ హీరోకు లేని స్పెషాలిటీ సుశాంత్ సింగ్‌కు ఉంది.చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఎక్కువగా ఇష్టపడే సుశాంత్‌ సింగ్.. చందమామపై స్థలం కొన్నాడు.

news18-telugu
Updated: June 17, 2020, 9:22 AM IST
చందమామపై స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్...
చందమామపై స్థలం కొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Instagram/Photos)
  • Share this:
అవును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో కలిచివేసాయి. అయితే.. ఏ హీరోకు లేని స్పెషాలిటీ సుశాంత్ సింగ్‌కు ఉంది.చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఎక్కువగా ఇష్టపడే సుశాంత్‌ సింగ్.. చందమామపై స్థలం కొన్నాడు. అక్కడ స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావడం విశేషం. ఒక సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే.. ఎక్కువగా అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇక చందమామాపై సుశాంత్ కొన్న ఈ స్థలాన్ని లూనార్ లాండ్ రిజిస్ట్రీ నుంచి కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లే చందమామపై స్థలాలను విక్రయిస్తున్నారు. అంతకు ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఓ అభిమాని చందమామపై స్థలం కొని ఆయకు బహుమతిగా ఇచ్చాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాల విషయానికొస్తే.. ఈయన  ప్రతి చిత్రానికి కనీసం రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకునే వాడని ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిగత సహాయకుడు వెల్లడించాడు. సుశాంత్ మొత్తం ఆస్తి విలువ.. దాదాపు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
View this post on Instagram

The My Side Of The Moon 🌓 #dreams


A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

ఇక సుశాంత్ తన  చివరి సినిమా ‘చిచోరే’ బాక్సాఫీస్ హిట్ కొట్టిన తర్వాత... బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... అప్‌కమింగ్ మూవీ ‘దిల్ బేచారే’లో నటించాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఎంఎస్ ధోనీ, ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలతో ఇండియా వైడ్ పాపులార్టీ తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం ఎంతో మందిని కలచివేస్తోంది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే అంశంపై విచారణ జరుగుతోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 17, 2020, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading