‘దిల్ బెచారా’ ట్రైలర్ వరల్డ్ రికార్డ్.. సుశాంత్ దెబ్బకు హాలీవుడ్ ఫసక్..

Dil Bechara trailer: ఓ మనిషిపై అభిమానం పెంచుకుంటే మరీ అంతగా పెంచుకుంటారా.. ఏంటయ్యా మీరు ఇలా ఉన్నారు అంటే మేమంతే సర్ ఎమోషనల్ ఫూల్స్ అంటూ ఠాగూర్ సినిమాలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 8:42 PM IST
‘దిల్ బెచారా’ ట్రైలర్ వరల్డ్ రికార్డ్.. సుశాంత్ దెబ్బకు హాలీవుడ్ ఫసక్..
దిల్ బెచారాలో సుశాంత్ (Dil Bechara trailer)
  • Share this:
ఓ మనిషిపై అభిమానం పెంచుకుంటే మరీ అంతగా పెంచుకుంటారా.. ఏంటయ్యా మీరు ఇలా ఉన్నారు అంటే మేమంతే సర్ ఎమోషనల్ ఫూల్స్ అంటూ ఠాగూర్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయనపై ప్రేక్షకులకు అభిమానం అస్సలు తగ్గట్లేదు సరికదా పెరిగిపోతుంది. చనిపోయిన తర్వాత ఓ మనిషిని ఇంతగా ఆరాధిస్తారా అన్నట్లు సుశాంత్ సింగ్‌పై ప్రేమ చూపిస్తున్నారు అభిమానులు.

సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)
సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)


దానికి నిదర్శనమే ఆయన చివరి సినిమా దిల్ బెచారా ట్రైలర్. డిస్ట్నీ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం జులై 24న ఫ్రీగా ప్రదర్శించబోతున్నారు. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడీగా సంజన సంఘీ నటించింది. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. ఏకంగా హాలీవుడ్ సినిమాల రికార్దులను కూడా తుడిచేస్తుంది. 'ఎలా పుట్టాలి ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉంది అంటూ' ట్రైలర్‌లో సుశాంత్ చెప్పిన డైలాగులు కన్నీరు పెట్టిస్తున్నాయి.

సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)
సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)


చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నావ్ సుశాంత్ అంటూ పదే పదే ట్రైలర్ చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికే ఈ ట్రైలర్ 7 కోట్ల వ్యూస్‌తో పాటు 10 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ రికార్డ్.. ఇప్పటి వరకు ఇన్ని మిలియన్స్ లైక్స్ అందుకున్న సినిమాలు మరేదీ లేదు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput/twitter)

హాలీవుడ్ మార్వల్ స్టూడియోస్ సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో సంచలనం రేపుతుంటాయి. ఇప్పుడు సుశాంత్ సినిమా మాత్రం దుమ్ము దులిపేస్తుంది. హాలీవుడ్ సినిమా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' సినిమాకు ఇది రీమేక్. సుశాంత్ స్నేహితుడు ముఖేష్ ఛాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొత్తానికి ట్రైలర్ ఇంతగా సంచలనాలు రేపుతుంటే రేపు సినిమా ఎలా ఉండబోతుందో మరి..?
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading