సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా కూడా ఓటిటిలోనే..

Sushant Singh Rajput: అభిమానుల కోరిక నెరవేరలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమాను ఎలాగైనా కూడా థియేటర్స్‌లో విడుదల చేయాలని వాళ్లు నిర్మాతలను వేడుకున్నా కూడా వాళ్లు మాట వినలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 5:35 PM IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా కూడా ఓటిటిలోనే..
సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)
  • Share this:
అభిమానుల కోరిక నెరవేరలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమాను ఎలాగైనా కూడా థియేటర్స్‌లో విడుదల చేయాలని వాళ్లు నిర్మాతలను వేడుకున్నా కూడా వాళ్లు మాట వినలేదు. దాంతో కుర్ర హీరో చివరి సినిమా కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. ఈయన గత సినిమా డ్రైవ్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదలైంది. కరోనా కూడా లేని సమయంలో చిచ్చోరే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సుశాంత్ సినిమాను కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ రావడం లేదంటూ కరణ్ జోహార్ డ్రైవ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసాడు.
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)
సుశాంత్ సింగ్ కరణ్ జోహార్ (sushant singh rajput karan johar)


ఇదిలా ఉంటే ఆయన మరణం తర్వాత ఇప్పుడు చివరి చిత్రం దిల్ బెచారా కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. బాలీవుడ్ ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రా ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సుశాంత్ సరసన సంజనా సంఘి హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. జులై 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో దిల్‌ బెచారా విడుదల కానుంది. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. సుశాంత్ చివరి సినిమాను దయచేసి థియేటర్స్‌లో విడుదల చేయాలని ఏఆర్ రెహమాన్ కూడా కోరాడు.
సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)
సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా (dil bechara movie)

కానీ నిర్మాతలు మాత్రం హాట్ స్టార్‌కు ఇచ్చేసారు. హాలీవుడ్ చిత్రం 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' రీమేక్‌గా 'దిల్ బేచారా' తెరకెక్కింది. ఈ సినిమా కచ్చితంగా అందరి మనస్సుల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ జులై 24న మీ ముందుకొస్తుందని డిస్నీ హాట్‌స్టార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వస్తుంది. మరి సుశాంత్ చివరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిక.
First published: June 25, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading