Sushant Singh Rajput: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ 14 June 2020న అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. ఈయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా బాలీవుడ్లో సినీ మాఫియా ఓ హీరో జీవితాన్ని ఎలా బలి తీసుకున్నదో సుశాంత్ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది. ఎక్కడో బిహార్‌లోని మారుమూల గ్రామం నుండి టీవీ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత బాలీవుడ్లో హీరోగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హీరోగా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటాడనుకున్న ఈయన అకాల మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్డించుకోలేకపోతున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే... తాజాగా దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎస్డీఎంసీ) ..ఆండ్రూస్ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టాలని ఆయన జయంతి రోజున ఆమోదించారు. గతేడాది సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గతేడాది ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో ఎక్కువ బిహార్ ప్రాంతంలోని రోడ్డు నంబరు 8లో బీహార్‌కు చెందిన వారు నివసిస్తున్నారని అప్పట్లో ప్రతిపాదించారు. దీంతో సౌత్ ఢిల్లీలోని ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంపునకు దారి తీసే రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గ్‌గా పేరు పెట్టారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయానికొస్తే.. ఈయన పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. "కై పో చే", "ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ", "కేదార్నాథ్" చిత్రాలు మంచి పేరును తెచ్చాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 21, 2021, 22:47 IST