బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్ ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సుశాంత్ మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. అది అలా ఉంటే ఈ కేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ రాజ్‌పుత్ కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలంటూ రియా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రియాను కేసులో ఇరికించడానికి సుశాంత్ తండ్రి తన బంధువుల పేర్లను వాడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను నేను చాలా ప్రేమించానని.. ఆయన మరణం ఎంతో కలచివేస్తోందని సుప్రీంకోర్టుకు వెల్లడించించి రియా. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఈ కేసులో మీడియాలో రకరకాల కథనాల కారణంగా తాను బాధితురాలుగా మారానంటూ వాపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.