సింగిల్ టేకులో పాటను పూర్తి చేసిన సుశాంత్.. అద్భుతమంటోన్న నెటిజన్స్..

Sushant Singh Rajput : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపింది.

news18-telugu
Updated: July 11, 2020, 10:55 AM IST
సింగిల్ టేకులో పాటను పూర్తి చేసిన సుశాంత్.. అద్భుతమంటోన్న నెటిజన్స్..
దిల్ బెచారాలో సుశాంత్ Photo : Twitter
  • Share this:
Dil Bechara : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపింది. అతని చావుకు బాలీవుడ్ పెద్దలే కారణం అంటూ పెద్ద సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. సుశాంత్‌కు రావాల్సిన, ఆయన చేయాల్సిన చాలా సినిమాలు కావాలనే కొందరు పనిగట్టుకుని రానివ్వకుండా చేశారనీ చర్చల సారాంశం. సుశాంత్ బయటవాడు కావడంతో అతన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మరణం.. కారణాల నేపథ్యంలో ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని, క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. అది అలా ఉంటే ఆయన న‌టించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ ట్రైలర్​ ఇప్పటికే రిలీజై రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్ హైయెస్ట్ లైక్డ్ ట్రైలర్ నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా టైటిల్​ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం.

ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలకు సుశాంత్ తనదైన గ్రేస్, స్మైల్, స్టైల్‌తో డ్యాన్స్ చేస్తూ సింగిల్ టేక్‌లో పూర్తి చేసి.. అభిమానుల మనసుల్ని క‌దిలిస్తున్నాడు. దాదాపు 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న ఈ సాంగ్ మొత్తాన్ని సింగిల్​ టేక్​లో సుశాంత్ కంప్లీట్ చెయ్య‌డం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమా హలీవుడ్ రొమాంటిక్ డ్రామా ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’కు రీమేక్‌‌గా వస్తోంది. సంజన సంఘీ హీరోయిన్​గా పరిచయమవుతోంది. ముఖేశ్ చబ్రా దర్శకత్వం వహించిన దిల్ బెచారా జులై 24 నుండి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది.
Published by: Suresh Rachamalla
First published: July 11, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading