బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజం (బంధుప్రీతి) పై విమర్శల వెల్లువెత్తున్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా గతనెల 14వ తేదీన సుశాంత్ ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో సినీ భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా ఆత్మహత్యకు పాల్పడడం ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది. ఇక ఆయన మరణం పట్ల రకరకాల రూమర్స్‌తో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మరణంపై నటుడు శేఖర్ సుమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నెలకు 50 సార్లు సిమ్ కార్డులను మార్చాడు, ఆయన ప్లాట్ డూప్లికేట్ ఉండాల్సిన ప్లేస్‌లో లేదు.. ఇలా కొన్ని లింక్‌లను ఉటంకిస్తూ సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశాడు.
'జస్టిస్ ఫర్ సుశాంత్' అనే ఫోరం ప్రారంభించిన సుమన్ మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యలో "కంటికి కనిపించని విషయాలు చాలా ఉన్నాయని పేర్కొన్నాడు. సుశాంత్ ఆత్మహత్య కేసు అంత సింపుల్‌గా మూసివేసే కేసు కాదని.. సుశాంత్ ఆత్మహత్య నోట్ లేకపోవడం, ఆయన ప్లాట్‌కు సంబందించిన నకిలీ కీని తప్పుగా వేరో చోట ఉంచడం వంటివి వేరే అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.