సుశాంత్ కేసులో సీబీఐ విచారణకు లావణ్య త్రిపాఠి డిమాండ్

Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ డిమాండ్‌ను బలపరుస్తున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 3:11 PM IST
సుశాంత్ కేసులో సీబీఐ విచారణకు లావణ్య త్రిపాఠి డిమాండ్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్(ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సమాధానాలు లేని  శేష ప్రశ్నలు చాలా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని అతని కుటుంబ సభ్యులతో పాటు సుశాంత్ ఫ్యాన్స్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో ముంబై పోలీసుల వ్యవహార తీరు సరిగ్గా లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ముంబై, బీహార్ పోలీసులు ఈ కేసుపై విడివిడిగా దర్యాప్తు జరుపుతున్నారు. ముంబై వెళ్లి సుశాంత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు జరుపుతున్న పాట్నా పోలీసులకు ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్‌ ఆత్మహత్యకు కారణమైన అతని గర్లఫ్రెండ్ రియా చక్రవర్తిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో నిజానిజాలు నిర్ధారించే సామర్థ్యం ముంబై పోలీసులకు ఉందని మహారాష్ట్రలో అధికార కూటమి పక్షాలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు చెబుతుతున్నారు.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని ఆయన తండ్రి కేకే సింగ్ కోరారు. ఈ మేరకు బీహార్ డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణకు బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే నేరం తమ రాష్ట్రంలో జరిగితే...సీబీఐ విచారణ కోరే అధికారం బీహార్‌కు లేదని మహారాష్ట్ర అధికార కూటమి నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించి, నిజానిజాలు ఏంటో తేల్చాలని పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనుక సూత్రధారులెవరో తేల్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోరింది.

sushant singh rajput case, sushant singh rajput news, sushant singh rajput cbi, sushant cbi, సుశాంత్ సింగ్ కేసు, సుశాంత్ కేసులో సీబీఐ విచారణ, సీబీఐ విచారణ, లావణ్య త్రిపాఠి
సినీ నటి లావణ్య త్రిపాఠి(ఫైల్ ఫోటో)


తాజాగా టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబీకులు, ఫ్యాన్స్ డిమాండ్‌ను సమర్థించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణాలేంటో తెలియడం లేదు...అయితే ఈ కేసును తప్పనిసరిగా సీబీఐ విచారణకు అప్పగించాలని కోరుకుంటున్నట్లు లావణ్య ఓ ట్వీట్ చేశారు.
సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది.
Published by: Janardhan V
First published: August 5, 2020, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading