Surya web series ఫైనల్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఇదే..షణ్ముఖ్ ఫ్యాన్స్ కన్నీళ్లు ఆగవు...

Surya Web Series

ఇప్పటికే 7 ఎపిసోడ్స్ విడుదలై యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించిన ఈ వెబ్ సిరీస్. తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఇంజనీరింగ్ పూర్తయి ఖాళీ ఖాళీగా ఉంటూ ఉద్యోగం లేకుండా ఫ్రెండ్స్ తో తిరగే ఓ మధ్య తరగతి కుర్రాడిగా షణ్ముఖ్ నటించి అందరి మన్ననలను పొందాడు.

  • Share this:
    షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు ఈ పేరు చెబితేనే యూట్యూబ్ సెర్చింజన్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ అనే ట్యాగ్ కనిపిస్తోంది. ఒకప్పుడు యూట్యూబ్ లోనే సాదా సీదా కామెడీస్కిట్స్, ఇమిటేషన్ డాన్సులు చేసే షన్ను ఇప్పుడు సూర్య వెబ్ సిరీస్ తో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్ తో మొదలైన షణ్ముఖ్ జస్వంత్ ప్రయాణం, సూర్య వెబ్ సిరీస్ తో ఏకంగా పీక్స్ కు చేరుకుంది. ఈ దెబ్బతో షణ్ముఖ్ జస్వంత్ కు సోషల్ మీడియాలో మూడున్నర మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్ నటించిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ ద్వారానే షణ్ముఖ్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా సూర్య వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు షణ్ముఖ్. యూట్యూబ్ లో షణ్ముఖ్ ఏ వెబ్ సిరీస్ ను విడుదల చేసినా.. అది సంచలనాలను సృష్టించాల్సిందే. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండాల్సిందే.

    ఇప్పటికే 7 ఎపిసోడ్స్ విడుదలై యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించిన ఈ వెబ్ సిరీస్. తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ విడుదలై యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఇంజనీరింగ్ పూర్తయి ఖాళీ ఖాళీగా ఉంటూ ఉద్యోగం లేకుండా ఫ్రెండ్స్ తో తిరగే ఓ మధ్య తరగతి కుర్రాడిగా షణ్ముఖ్ నటించి అందరి మన్ననలను పొందాడు. సూపర్ డూపర్ గా షణ్ముఖ్ నటించి అందరి ప్రశంసలు పొందాడు. అయితే ఈ సిరీస్ లో షణ్ముఖ్ జంటగా మౌనిక రెడ్డి నటించింది. చాలా హోమ్లీ లుక్ తో క్లీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. అయితే ఈ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ లో ఒక అనుకోని ట్విస్ట్ ఉందనే లీకులు, ఫ్యాన్ థియరీలు బయటకు వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ తరహాలోనే, సూర్య వెబ్ సిరీస్ కూడా ఓ సాడ్ ఎండింగ్ తో ముగుస్తుంది అని తెలుస్తోంది. చివరి ఎపిసోడ్ షణ్ముఖ్ ఫ్యాన్స్ ను కంటతడి పెట్టించడం ఖాయం అంటున్నారు. సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫైనల్ ఎపిసోడ్ కూడా షన్ను తన యాక్టింగ్ తో చించేశాడు. అలాగే సూర్య వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ సూర్య, అంజలి మధ్య బ్రేకప్ సీన్ ఉంటుందని, సూర్య నానా కష్టాలు పడి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుతున్న టైంలో అంజలితో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల ఇద్దరు విడిపోతారని, అది గుర్తించేలోగా అంజలి మ్యారేజ్ అయిపోతుందని, ఇలా సూర్య వెబ్ సిరీస్ ఒక సాడ్ ఎండింగ్ లవ్ ఫెయిల్యూర్ నోట్ తో ముగుస్తుందని ఫ్యాన్ థియరీలు వినిపిస్తున్నాయి.
    Published by:Krishna Adithya
    First published: