హోమ్ /వార్తలు /సినిమా /

అదిరిపోయే ధరకు అమ్ముడుపోయిన ఆకాశం నీ హద్దురా..

అదిరిపోయే ధరకు అమ్ముడుపోయిన ఆకాశం నీ హద్దురా..

ఆకాశం నీ హద్దురా.. Photo : Twitter

ఆకాశం నీ హద్దురా.. Photo : Twitter

Soorarai Pottru : తమిళ హీరో సూర్య, సుధా కొంగర కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

  Soorarai Pottru : తమిళ హీరో సూర్య, సుధా కొంగర ప్రసాద్ కాంబినేషన్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'సూరారై పోట్రు' అనే పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమాలో 'పిల్ల పులి' అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది. జి వి ప్రకాష్ కుమార్ అందించిన ఆ పాటకు రామజోగయ్య రాసిన లిరిక్స్ తోడవ్వటంతో 'పిల్ల పులి' పాట యూట్యూబ్‌లో ఇరగదీస్తోంది. కాగా ఈ సినిమా సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతోంది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో అలరించనున్నాడు. సుధా కొంగర గతంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో 'గురు' సినిమాను దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

  ‘ఆకాశం నీ హద్దురా’ను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. మలయాళీ నటి అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న నటిస్తున్నారు. కాగా ఈ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే సన్ నెట్‌వర్క్ భారీ ధర చెల్లించి శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. ‘ఆకాశం నీ హద్దురా’ వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya

  ఉత్తమ కథలు