• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SURYA KIRAN TO DEVI NAGAVVALI HERE IS THE LIST OF MOST DISAPPOINTING CONTESTANTS OF THE BIGG BOSS 4 MNJ

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ సీజ‌న్ 4లో మోస్ట్ డిజ‌ప్పాయింటింగ్ కంటెస్టెంట్‌లు వీరే..!

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ సీజ‌న్ 4లో మోస్ట్ డిజ‌ప్పాయింటింగ్ కంటెస్టెంట్‌లు వీరే..!

బిగ్ బాస్ 4 డిజప్పాయింటెడ్ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ 4(Bigg Boss 4) స‌మరం ముగియ‌నుంది. క‌రోనా నేప‌థ్యంలోనూ అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. అభిజీత్(Abijeet), అఖిల్(Akhil), అరియానా(Ariyana), హారిక(Harika), సొహైల్(Sohel), మోనాల్(Monal), లాస్య(Lasya), మెహబూబ్(Mehaboob)

  • Share this:
    Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ 4 స‌మరం ముగియ‌నుంది. క‌రోనా నేప‌థ్యంలోనూ అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ సీజ‌న్ విజేత ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది. అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహైల్, మోనాల్, లాస్య, మెహబూబ్, రాజశేఖర్, నోయల్, దివి, సుజాత, గంగవ్వ, దేవి నాగవల్లి, కరాటే కల్యాణి, సూర్యకిరణ్‌లు ఈ సీజ‌న్‌లో పాల్గొనగా.. కుమార్ సాయి, స్వాతి దీక్షిత్, అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అభిజీత్, అఖిల్, అరియానా, హారిక, సొహైల్‌లు ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు. కాగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొంత‌మంది కంటెస్టెంట్‌లు మాత్రం తామేంటో నిరూపించుకోకుండానే వెనుక‌డుగు వేశారు. ఇంకొంత‌మంది ఎలిమినేష‌న్ వారి ఫ్యాన్స్‌ని బాగా హ‌ర్ట్ అయ్యేలా చేసింది. ఆ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం.

    సూర్య కిర‌ణ్‌
    గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్న ఈ ద‌ర్శ‌కుడు బిగ్‌బాస్ 4తో మంచి కంబ్యాక్ ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ మొద‌టి వార‌మే అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. కానీ ఎలిమినేష‌న్ త‌రువాత ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లో ఆయ‌న మాట‌ల‌ను చూసి అన‌వ‌స‌రంగా ఎలిమినేట్ అయ్యార‌ని చాలా మంది ఫీల్ అయ్యారు.

    సూర్య కిరణ్


    క‌రాటే క‌ళ్యాణి
    ఈ సీజ‌న్‌లోకి వ‌చ్చిన సీనియ‌ర్‌ కంటెస్టెంట్‌ల‌లో క‌రాటే క‌ళ్యాణి ఒక‌రు. కాగా హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత క‌ల్యాణి పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. దానికి తోడు త‌న పెద్ద గొంతుతో ఆమెపై ట్రోల్స్ కూడా బాగా వ‌చ్చాయి.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    కరాటే కళ్యాణి


    దేవి నాగ‌వ‌ల్లి
    ఈ సీజ‌న్‌లో హౌజ్‌లోకి ఎంట‌ర్ అయిన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల‌లో దేవి నాగ‌వ‌ల్లి ఒక‌రు. హౌజ్‌లోకి వెళ్ల‌క‌ముందే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్.. హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత త‌నదైన పంథాతోనే ఆట‌ను ఆడింది. ప్ర‌తి టాస్క్‌లోనూ ఆమె త‌న ఎఫర్ట్‌ని పెట్టేది. అంతేకాదు త‌న నిర్ణ‌యాల‌ను సూటిగా, సుత్తిలేకుండా చెప్పేది. అలాంటి దేవి అనూహ్యంగా హౌజ్‌లోకి బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. ఆ స‌మ‌యంలో బిగ్‌బాస్‌పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. దేవిని హౌజ్‌లోకి మ‌ళ్లీ తీసుకురండి అంటూ సోష‌ల్ మీడియాలో సైతం అభిమానులు కామెంట్లు పెట్టారు.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    దేవి నాగవల్లి


    స్వాతి దీక్షిత్‌
    మ‌ధ్య‌లో సోసోగా న‌డుస్తోన్న బిగ్‌బాస్‌లో గ్లామ‌ర్‌ని పెంచేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా స్వాతికి అవ‌కాశం ఇచ్చారు. ఆమె వెళ్లక‌ముందు వ‌ర‌కు మోనాల్ చుట్టూ తిరిగిన ప‌లువురు కంటెస్టెంట్‌లు.. ఆ త‌రువాత స్వాతివైపు మారారు. ఇక ఆమె ఎన్నో రోజులు హౌజ్ లో ఉంటుందని అందరూ భావించారు. కానీ కొన్ని కార‌ణాలతో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారానికే ఈ బుట్ట‌బొమ్మ బ‌య‌ట‌కు రావాల్సి వచ్చింది.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    స్వాతి దీక్షిత్


    లాస్య మంజునాథ్‌
    ఈ సీజ‌న్‌లో టైటిల్ ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన వారిలో లాస్య ఒక‌రు. అయితే హౌజ్‌లోకి వెళ్లిన త‌రువాత వంట‌గ‌దికే ఎక్కువ‌గా ప‌రిమిత‌మైన ఈ యాంక‌ర్.. ఫ్యాన్స్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీంతో ఫైన‌ల్ వ‌ర‌కు ఉండ‌లేక‌పోయింది.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    లాస్య మంజునాథ్


    జోర్దార్ సుజాత‌
    త‌న తెలంగాణ యాక్సెంట్‌తో హౌజ్‌లోకి వెళ్ల‌క‌ముందే గుర్తింపు తెచ్చుకున్న సుజాత‌.. అక్క‌డికి వెళ్లిన త‌రువాత మాత్రం గాసిప్ క్వీన్‌గా మారిపోయింది. అంతేకాదు ఆమె ఎందుకు న‌వ్వుతుందో అర్థం కాక చాలా మంది నెటిజ‌న్లు ట్రోల్ చేసేవారు. ఇక నాగార్జున‌ను బిట్టు అని పిల‌వ‌డం కూడా ఆమెపై నెగిటివిటినీ పెంచింది. అయితే నిర్వాహ‌కులే త‌న చేత అలా పిలిపించార‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత క్లారిటీ ఇచ్చింది సుజాత‌.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    జోర్దార్ సుజాత


    కుమార్ సాయి
    ఈ సీజ‌న్‌లో మొద‌టి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన‌ కుమార్ సాయి.. మొద‌ట్లో పెద్ద‌గా అంద‌రిలో క‌ల‌వ‌కపోయినా ఆ త‌రువాత త‌న‌ను తాను మెరుగుపెట్టుకుంటూ వ‌చ్చాడు. టాస్క్‌ల‌లో కూడా బాగా ఆడి, కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అయితే కుమార్ సాయిని ఎలిమినేట్ చేసిన‌ప్పుడు కూడా బిగ్‌బాస్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

    Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Grand Finale, Bigg Boss 4 contestants, Bigg Boss 4 disappointing contestants, Bigg Boss 4 elimination, Bigg Boss 4 Nagarjuna
    కుమార్ సాయి


    కాగా ప్రస్తుతం టాప్ 5లో అభిజీత్, హారిక, అఖిల్, సొహైల్, అరియానాలు ఉండగా.. ఈ సీజన్ విజేతగా అభిజీత్ నిలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Manjula S
    First published: